మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు.. జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా

ఫెడరేషన్‌ అధ్యక్షుడు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని క్రీడాకారుల ఆరోప‌ణ‌ అవి అవాస్త‌వాల‌ని ఖండిస్తున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ దోషిగా తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమని ప్ర‌క‌ట‌న‌ విధాత: జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచి దేశ కీర్తి ప్రతిష్ఠలను నిలిపిన ఆటగాళ్లు తమ మాన, ప్రాణాలను కాపాడాలని రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. క్రీడలను ప్రోత్సహించాల్సిన ఫెడరేషన్‌ బాధ్యులే ఆటగాళ్లను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. భారత రెజ్లింగ్‌ […]

  • By: krs    latest    Jan 19, 2023 10:59 AM IST
మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులు.. జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా
  • ఫెడరేషన్‌ అధ్యక్షుడు అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని క్రీడాకారుల ఆరోప‌ణ‌
  • అవి అవాస్త‌వాల‌ని ఖండిస్తున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌
  • దోషిగా తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమని ప్ర‌క‌ట‌న‌

విధాత: జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో గెలిచి దేశ కీర్తి ప్రతిష్ఠలను నిలిపిన ఆటగాళ్లు తమ మాన, ప్రాణాలను కాపాడాలని రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. క్రీడలను ప్రోత్సహించాల్సిన ఫెడరేషన్‌ బాధ్యులే ఆటగాళ్లను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.

భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌ అనేక అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని క్రీడాకారులు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులను లైంగికగా వేధిస్తున్నాడని వినేష్‌ ఫోగట్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

స్థానిక, అంతర్జాతీయ పర్యటనల సందర్భంగా కనీస సదుపాయాలు కల్పించకుండా వేధిస్తున్నాడని అంటున్నారు. పోటీలకు ఎంపిక కావాలంటే.. తనకు అనుకూలంగా నడుచు కోవాల్సిందేనని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

బ్రిజ్‌భూషణ్ ఆగడాలకు నిరసనగా రెజ్లింగ్‌ క్రీడాకారులంతా ఏకమై జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు దిగి గళమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారులు భజరంగ్ పూనియా, వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌ తదితరులు పాల్గొనటం గమానార్హం.

బీజేపీ సీనియర్‌ నేత అయిన బ్రిజ్‌భూషణ్‌ మాత్రం క్రీడాకారుల ఆరోపణలన్నీ అవాస్తవాలని చెప్పుకొస్తున్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని అంటున్నాడు. దోషిగా తేలితే ఉరిశిక్షకైనా సిద్ధమని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో.. నిష్పాక్షిక విచారణ కోసం.. విచారణ పూర్తయ్యే దాకా మీరు పదవికి రాజీనామా చేస్తున్నారా? అని మీడియా అతన్ని ప్రశ్నించింది. దీంతో ఆయన అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు.

బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ మొదటి నుంచీ వివాదస్పదుడే. గతంలో ఆయనపై హత్య, విధ్వంసం, దహనం లాంటి తీవ్ర నేరారోపణలున్నాయి. గత ఏడాది ఒలింపిక్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఫోగట్‌కు తగిన రక్షణ కల్పించి , బ్రిజ్‌ భూషణ్ కార్యకలాపాలపై విచారణ చేపట్టాలని క్రీడాలోకం కోరుతున్నది.