ఎన్టీఆర్ పేరు తొలగించడం తప్పే.. వైరల్ అవుతున్న షర్మిల వ్యాఖ్యలు
విధాత: రాత్రికి రాత్రి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఇక అన్న వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చెల్లెలు షర్మిల కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న YSRTP అధ్యక్షురాలు షర్మిల ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ […]

విధాత: రాత్రికి రాత్రి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఇక అన్న వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చెల్లెలు షర్మిల కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న YSRTP అధ్యక్షురాలు షర్మిల ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ పేరు కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లవుతుందని స్పష్టం చేశారు.
కారణాలు ఏవైనా ఎవరి పేర్లు ఉన్నాయో, ఆ పేర్లే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ఆ పేరుకు మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. పేర్లు మార్చుతూ కొత్త పేర్లను డిసైడ్ చేస్తే అయోమయం ఏర్పడుతుందని షర్మిల వ్యాఖ్యానించారు.