Sherlyn Chopra | రాహుల్ గాంధీని పెళ్లాడుతా.. న‌టి షెర్లిన్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Sherlyn Chopra | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పెళ్లాడుతానంటూ ప్ర‌ముఖ మోడ‌ల్, బాలీవుడ్ న‌టి షెర్లిన్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిత్యం బోల్డ్ లుక్‌తో నెట్టింట ర‌చ్చ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే షెర్లిన్ చోప్రా.. తాజాగా రాహుల్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి మీడియా దృష్టిని ఆక‌ర్షించింది. 50 ఏండ్లు నిండిన ఇంకా బ్ర‌హ్మ‌చారిగానే ఉన్న రాహుల్ గాంధీని వివాహం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఆమె తెలిపింది. ఇటీవ‌లే షెర్లిన్ ముంబైలోని బాంద్రాకు వెళ్లింది. […]

Sherlyn Chopra | రాహుల్ గాంధీని పెళ్లాడుతా.. న‌టి షెర్లిన్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Sherlyn Chopra | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పెళ్లాడుతానంటూ ప్ర‌ముఖ మోడ‌ల్, బాలీవుడ్ న‌టి షెర్లిన్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నిత్యం బోల్డ్ లుక్‌తో నెట్టింట ర‌చ్చ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే షెర్లిన్ చోప్రా.. తాజాగా రాహుల్‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి మీడియా దృష్టిని ఆక‌ర్షించింది. 50 ఏండ్లు నిండిన ఇంకా బ్ర‌హ్మ‌చారిగానే ఉన్న రాహుల్ గాంధీని వివాహం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు ఆమె తెలిపింది.

ఇటీవ‌లే షెర్లిన్ ముంబైలోని బాంద్రాకు వెళ్లింది. అక్క‌డ ఆమెను చూసేందుకు అభిమానులు ఎగ‌బ‌డ్డారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. అయితే ఓ అభిమాని ఆమెను ఈ విధంగా ప్ర‌శ్నించాడు. రాహుల్ గాంధీని వివాహం చేసుకోవ‌డ మీకు ఇష్ట‌మేనా..? అని ప్ర‌శ్నించ‌డంతో.. ఆమె సానుకూలంగా స్పందించింది. రాహుల్‌ను ఎందుకు వివాహం చేసుకోవ‌ద్దు.. అందులో త‌ప్పేముంది అని చెబుతూ అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది.

అయితే, పెళ్లి విషయంలో కొన్ని షరతులు ఉంటాయని తెలిపింది. పెళ్లి తర్వాత తన ఇంటిపేరులో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అందుకు రాహుల్‌ అంగీకరిస్తే పెళ్లి చేసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.