పాఠశాలలకు దసరా సెలవులు తగ్గింపు.. SCERT ప్రతిపాదన
విధాత: పాఠశాలలకు దసరా సెలవులు తగ్గించాలని SCERT ప్రతిపాదించింది. 14 రోజులకు బదులు 9 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. వర్షాలు, సెప్టెంబర్ 17 వల్ల 7 రోజులు తగ్గాయని తెలిపింది. ఏడాదికి 225-230 పాఠశాలలు పనిదినాలు ఉండాలని ఎస్‌సీఈఆర్టీ రాష్ట్ర ప్రభుత్వానికి షెడ్యూల్ ఇస్తుంది. దాని ప్రకారం అకడమిక్ క్యాలెండర్ తయారవుతుంది. అయితే ఎన్ని రోజులు పనిదినాలు ఉండాలనే నిర్ణయం పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌దే. తాజాగా ఎస్‌సీఈఆర్టీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా అన్న […]

విధాత: పాఠశాలలకు దసరా సెలవులు తగ్గించాలని SCERT ప్రతిపాదించింది. 14 రోజులకు బదులు 9 రోజులు సెలవులు ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. వర్షాలు, సెప్టెంబర్ 17 వల్ల 7 రోజులు తగ్గాయని తెలిపింది.
ఏడాదికి 225-230 పాఠశాలలు పనిదినాలు ఉండాలని ఎస్‌సీఈఆర్టీ రాష్ట్ర ప్రభుత్వానికి షెడ్యూల్ ఇస్తుంది. దాని ప్రకారం అకడమిక్ క్యాలెండర్ తయారవుతుంది. అయితే ఎన్ని రోజులు పనిదినాలు ఉండాలనే నిర్ణయం పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌దే.
తాజాగా ఎస్‌సీఈఆర్టీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తుందా? లేదా అన్న సంగతి పక్కపెడితే ప్రభుత్వం దసరాలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎస్‌సీఈఆర్టీ ఎందుకు సెలవులు తగ్గించాలని ప్రతిపాదించింది? అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాల్లో ఎస్‌సీఈఆర్టీ ఎందుకు జోక్యం చేసుకుంటున్నదనే చర్చ ఉపాధ్యాయవర్గాల్లో నడుస్తున్నది.
