సంయుక్తా మీన‌న్‌: అసలు..పెళ్లి అవసరమా?

విధాత‌: కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో హీరోయిన్లు వివాహం చేసుకోవడానికి జంకుతారు. వివాహం చేసుకుంటే తమకు ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో అని భయపడుతూ ఉంటారు. ఇది ఉత్తరాదిన కాస్త నయం. కానీ దక్షిణాదినైతే మరీ ఎక్కువ. ఇక్కడ పెళ్లయిన హీరోయిన్లను పెద్దగా ఆదరించరు. ఎవ‌రో న‌య‌న‌తార‌, స‌మంత వారికి త‌ప్ప మిగిలిన వారి విషయంలో మాత్రం భిన్నంగా ప‌రిస్థితి ఉంటుంది. కాబట్టి కెరీర్ బాగా సాగుతున్నంత కాలం మన హీరోయిన్లు పెళ్లి విషయంలో మాట మారుస్తూ ఉంటారు. […]

సంయుక్తా మీన‌న్‌: అసలు..పెళ్లి అవసరమా?

విధాత‌: కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో హీరోయిన్లు వివాహం చేసుకోవడానికి జంకుతారు. వివాహం చేసుకుంటే తమకు ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో అని భయపడుతూ ఉంటారు. ఇది ఉత్తరాదిన కాస్త నయం. కానీ దక్షిణాదినైతే మరీ ఎక్కువ. ఇక్కడ పెళ్లయిన హీరోయిన్లను పెద్దగా ఆదరించరు. ఎవ‌రో న‌య‌న‌తార‌, స‌మంత వారికి త‌ప్ప మిగిలిన వారి విషయంలో మాత్రం భిన్నంగా ప‌రిస్థితి ఉంటుంది.

కాబట్టి కెరీర్ బాగా సాగుతున్నంత కాలం మన హీరోయిన్లు పెళ్లి విషయంలో మాట మారుస్తూ ఉంటారు. పెళ్లి అవసరమా.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.. ఇలాంటి సమాధానాలు ఇస్తూ ఉంటారు. అదే అవకాశాలు తగ్గుతున్న సమయంలో వెతుక్కుంటూ వచ్చిన బడాబడా వ్యాపారవేత్తలను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లను వివాహం చేసుకొని స్థిర పడుతూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత మరోసారి రీఎంట్రీ అంటారు.

కానీ సినిమాల‌లో పూర్తి రివ‌ర్స్‌గా ఉంటుంది. సినిమాలలో హీరోకు హీరోయిన్లకు వెంటనే లవ్ పుడుతుంది. సినిమా పూర్తయ్యలోపు పెళ్లి కూడా అయిపోతుంది. కానీ మన హీరోయిన్ల నిజ జీవితంలో పెళ్లి మాత్రం చరమాంకంలోనే అని చెప్పాలి. అప్పుడే వారు ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది నిర్ణయించుకుంటారు.

ఇక విషయానికి వస్తే ‘భీమ్లా నాయక్’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీ ‘బింబిసార’లో కూడా నటించింది. ఈనెల 17న విడుదల కానున్న ‘సార్’ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా సంయుక్త మీనన్ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అసలు పెళ్లి అవసరమా అనేసింది.

ఆమె మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవాలంటే నా ఆలోచనలకు తగ్గ వ్యక్తి దొరకాలి. నన్ను ప్రేమగా చూసుకునే వాడు దొరకాలి. నా ఎమోషన్స్‌ను గౌరవించాలి. ఇలా అన్ని రకాలుగా నచ్చితే అప్పుడు చూద్దాం. ప్రస్తుతాని కైతే పెళ్లి ఆలోచన లేదు. చాలా మంది ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి నన్ను అడుగుతున్నారు. అసలు పెళ్లి అవసరమా? అని కూడా కొందరు అడిగారు.

ప్రతి కుటుంబంలో మహిళ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. ఇంటి పని చేస్తుంది.. జాబ్ చేస్తుంది. అలాంటి ఆలోచనలు ఉన్న వారి విధానం వేరుగా ఉంటుంది. సరైన వాడు దొరికితేనే మహిళ సేఫ్‌గా ఉంటుంది. లేదంటే పెళ్లి మీద అసహనం ఏర్పడుతుంది అంటూ సంయుక్తా మీన‌న్ చెప్పుకొచ్చింది.