Viral Video | నిగీన్ సరస్సులో.. సోనియా గాంధీ బోట్ రైడ్..
Viral Video | కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌కు చేరుకున్న సోనియా గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలతో ముచ్చటించిన సోనియా.. అనంతరం నిగీన్ సరస్సును సందర్శించారు. ఇంజిన్ బోటులో ఆమె సరస్సులో రైడ్ చేశారు. సోనియా బోట్ రైడ్‌ను వీక్షించేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. సోనియా బోట్ రైడ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో […]

Viral Video |
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. శ్రీనగర్‌కు చేరుకున్న సోనియా గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ కార్యకర్తలతో ముచ్చటించిన సోనియా.. అనంతరం నిగీన్ సరస్సును సందర్శించారు.
ఇంజిన్ బోటులో ఆమె సరస్సులో రైడ్ చేశారు. సోనియా బోట్ రైడ్‌ను వీక్షించేందుకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. సోనియా బోట్ రైడ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో సోనియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై కార్యకర్తలతో కలిసి చర్చించారు.
#WATCH | J&K: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives in Srinagar and takes a boat ride in Nigeen Lake
She will be meeting Congress MP Rahul Gandhi shortly pic.twitter.com/9jBEKG2ZB8
— ANI (@ANI) August 26, 2023