Special MMTS Trains | వినాయక నిమజ్జనం.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Special MMTS Trains | వినాయక నిమజ్జనం.. ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Special Metro Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28, 29 తేదీల్లో నగరంలో వివిధ మార్గాల్లో ప్రత్యేకంగా ఎంఎంటీసీ ట్రైన్స్‌ను నడుపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 28న హైదరాబాద్- లింగంపల్లి (GHL-5), సికింద్రాబాద్-హైదరాబాద్ (GSH-1) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది.

ఈ నెల 29న లింగంపల్లి-ఫలక్‌నుమా (GLF-6), హైదరాబాద్- లింగంపల్లి (GHL-2), లింగంపల్లి- హైదరాబాద్ (GLH-3), ఫలక్‌నుమా – సికింద్రాబాద్ (GFS-7), హైదరాబాద్ – సికింద్రాబాద్ (GHS-4), సికింద్రాబాద్ – హైదరాబాద్ (GSH-8) నడుపనున్నట్లు ప్రకటించింది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.