Viral Video | చిరుతను తరిమికొట్టిన వీధి కుక్కలు..
Viral Video | వీధి కుక్కలను గ్రామ సింహాలు అని పిలుచుకుంటాం. ఎందుకంటే.. ఊర్లోకి ఓ కొత్త వ్యక్తి వచ్చినా, ఓ కొత్త జంతువు వచ్చినా మొరుగుతూనే ఉంటాయి. ఆ వ్యక్తి, ఆ జంతువు గ్రామం నుంచి వెళ్లే దాకా వెంటపడుతాయి. అవసరమైతే దాడికి కూడా వెనుకాడవు కుక్కలు. అందుకే వాటిని పెద్దలు గ్రామ సింహాలు అని పిలుస్తారు. అయితే ఊర్లోకి వచ్చిన ఓ చిరుతను కూడా కుక్కలు తరిమికొట్టాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. […]

Viral Video | వీధి కుక్కలను గ్రామ సింహాలు అని పిలుచుకుంటాం. ఎందుకంటే.. ఊర్లోకి ఓ కొత్త వ్యక్తి వచ్చినా, ఓ కొత్త జంతువు వచ్చినా మొరుగుతూనే ఉంటాయి. ఆ వ్యక్తి, ఆ జంతువు గ్రామం నుంచి వెళ్లే దాకా వెంటపడుతాయి. అవసరమైతే దాడికి కూడా వెనుకాడవు కుక్కలు. అందుకే వాటిని పెద్దలు గ్రామ సింహాలు అని పిలుస్తారు. అయితే ఊర్లోకి వచ్చిన ఓ చిరుతను కూడా కుక్కలు తరిమికొట్టాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ చెట్టుపై ఉన్న చిరుత.. మెల్లిగా కిందకు దిగి, గ్రామంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. చిరుతను అక్కడే ఉన్న వీధి కుక్కలు గమనించాయి. దాన్ని చూసిన వెంటనే కుక్కలు మొరగడం మొదలు పెట్టాయి. గ్రామంలోకి రానివ్వకుండా చిరుతపై తిరుగుబాటు చేశాయి.
కుక్కల అటాక్‌తో చిరుత అటు ఇటు పరుగులు తీసింది. కాస్త బెదిరింది కూడా. చిరుత కూడా కోపంతో కుక్కలపై దాడి చేసేందుకు యత్నించింది. కానీ.. ఆ చిరుత పంజాకు కుక్కలు చిక్కలేదు. దానికి చిరాకు తెప్పించి అక్కడి నుంచి తరిమికొట్టాయి.
ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. మా వీధిలోని కుక్కలు సింహాలతో సమానం అని క్యాప్షన్ ఇచ్చాడు. నిజానికి…ఆ చిరుత తలుచుకుంటే కుక్కని వేటాడి చంపేస్తాయి. కానీ…ఇక్కడ ఒకేసారి నాలుగైదు కుక్కలు ఎగబడే సరికి దానికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి జారుకుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది.