నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలి: కలెక్టర్ పమేలా సత్పతి
విధాత: విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధులు ప్రణయ్, యశ్వంత్ ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్- 2022 పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాల దశ నుండి విద్యార్ధుల్లో వినూత్న ఆవిష్కరణలను, సమస్యా పరిష్కార […]

విధాత: విద్యార్థులను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధులు ప్రణయ్, యశ్వంత్ ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్- 2022 పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాల దశ నుండి విద్యార్ధుల్లో వినూత్న ఆవిష్కరణలను, సమస్యా పరిష్కార నైపుణ్యాలను, డిజైన్ థింకింగ్ ను పెంపొందింపచేయడానికి, రాష్ట్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, స్టేట్ ఇన్నోవేషన్ సెల్, యునిసెఫ్ ఇండియా, ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్ సహకారంతో జిల్లాలో 6 నుండి 10 వ తరగతి పాఠశాలలు కోసం స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ -2022 ను ప్రారంభించడం జరిగిందన్నారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల, తెలంగాణ ఆదర్శ, కస్తూర్బా కలిపి మొత్తం 168 పాఠశాలలు దీనిలో రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఆవిష్కరణ రంగంలో మన జిల్లా ముందంజలో ఉన్నదని, అలాగే స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ -2022 లో కూడా ఉపాధ్యాయులు విద్యార్థలను నూతన ఆవిష్కరణలు చేసే విధంగా ప్రొత్సహించి జిల్లాను ముందంజలో నిలపాలని కోరారు. ఇంటింటా ఇన్నోవేటర్, స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లాంటి ఇన్నోవేషన్ కార్యక్రమాలను జిల్లా 100 శాతం అమలు పరచడంలో ముందుంటుందని తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారి కె. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇన్నోవేషన్ అనేది ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని, పాఠశాల విద్యార్థులు సైతం ఇన్నోవేషన్ లు చేసేలా ఉపాధ్యాయులు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్-2022 ను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధులు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించి పాఠశాలల, విద్యార్థుల జట్లను ఆన్లైన్ ద్వారా నమోదు చేయించడం జరిగింది అని తెలిపారు.
కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి ఆండాళు, జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్, జిల్లా సైన్స్ కాంగ్రెస్ అకడమిక్ కోఆర్డినేటర్ నర్సింహా చారి, సబ్జెక్ట్ ఫోరమ్ ప్రతినిధులు రాజశేఖర్, బుస్స రమేష్, నరేంద్ర స్వామి, సత్యనారాయణ, ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉన్నత పాఠశాలలు, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.