Sucide | జనగామ.. ఉరేసుకుని SI భార్య ఆత్మహత్య.. తట్టుకోలేక గన్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
బాత్రూంలో ఉరేసుకొని భార్య మృతి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై మృతి కుటుంబ కలహాలు కారణమా? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ ఎస్ఐ కాసార్ల శ్రీనివాస్ దంపతులు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య (suicide) చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనగామ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి తన సర్వీసులు రివాల్వర్ తో కాల్చుకొని […]

- బాత్రూంలో ఉరేసుకొని భార్య మృతి
- సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై మృతి
- కుటుంబ కలహాలు కారణమా?
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ ఎస్ఐ కాసార్ల శ్రీనివాస్ దంపతులు ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య (suicide) చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనగామ జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. భార్య స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కాసార్ల శ్రీనివాస్ గదిలోకి వెళ్లి తన సర్వీసులు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య స్వరూప బాత్రూంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోగా ఈ సంఘటన స్వయంగా చూసిన ఎస్ఐ బయటికి వచ్చి బోరున విలపించారు.
జనగామ.. ఉరేసుకుని SI భార్య ఆత్మహత్య.. తట్టుకోలేక గన్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య https://t.co/5VXCVyYomi pic.twitter.com/9qW4WeiR4T
— vidhaathanews (@vidhaathanews) April 6, 2023
సమాచారం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు, పోలీసులు అక్కడికి వచ్చి ఘటనపై ఆరా తీస్తుండగా గదిలోకి వెళ్లిన శ్రీనివాస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది.
ఎస్సై శ్రీనివాస్ తల మీద గాయం ఉండడం చర్చకు దారి తీసింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ తగాదాలే ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.