వరంగల్: ఉరేసుకొని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
రెండు వేర్వేరు ఘటనలు తల్లిదండ్రులకు కడుపుకోత విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకేరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషాద ఘటనలు మంగళవారం వేరువేరుగా జరిగాయి. కారణాలేవైనా చిన్నారుల ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఆత్మహత్యల రుగ్మత ఇప్పుడు క్రమంగా చిన్నారులను కూడా కబళించే దశకు చేరడం బాధాకరం. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాస్టల్‌లో ఉరి వేసుకొని.. […]

- రెండు వేర్వేరు ఘటనలు
- తల్లిదండ్రులకు కడుపుకోత
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకేరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషాద ఘటనలు మంగళవారం వేరువేరుగా జరిగాయి. కారణాలేవైనా చిన్నారుల ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఆత్మహత్యల రుగ్మత ఇప్పుడు క్రమంగా చిన్నారులను కూడా కబళించే దశకు చేరడం బాధాకరం. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హాస్టల్‌లో ఉరి వేసుకొని..
హన్మకొండ విజయపాల్ కాలనీలోని నవయుగ పాఠశాల హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి వంగపడ్ల వివేక్ (13) హాస్టల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి సుబేదారి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తండ్రి మందలించాడని..
తండ్రి మందలించాడని బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఎదురబోయిన వీరమల్లు రేణుక-దంపతుల కుమారుడు రవిచరణ్ ను ఇంట్లో తండ్రి తిట్టాడు. దీంతో బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.