మహేష్‌కు.. మన్మధ బాణాలు విసురుతున్న సీనియర్ బ్యూటీ
విధాత: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం, మేన్లినెస్‌కు పడిపోని వారంటూ ఉండరు. ఆయన అందంకు అభిమానులు కాని వారు ఎవరూ లేరు. పడుచు అమ్మాయిల నుంచి 50 ఏండ్ల ఆంటీల దాకా మహేష్ బాబు అంటే మహేష్ అంటారు. ఒళ్లంతా పులకరించే జలదరించేలా తాము చూస్తున్నది కలయా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉండిపోతారు. అదేదో సినిమాలో స్వాతి రెడ్డి ఎంత పిచ్చిగా మహేష్‌ని అభిమానిస్తుందో అలాంటి వారు నిజజీవితంలో కోకోల్లలు. ఇక అలాంటి మహేష్ […]

విధాత: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం, మేన్లినెస్‌కు పడిపోని వారంటూ ఉండరు. ఆయన అందంకు అభిమానులు కాని వారు ఎవరూ లేరు. పడుచు అమ్మాయిల నుంచి 50 ఏండ్ల ఆంటీల దాకా మహేష్ బాబు అంటే మహేష్ అంటారు. ఒళ్లంతా పులకరించే జలదరించేలా తాము చూస్తున్నది కలయా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉండిపోతారు. అదేదో సినిమాలో స్వాతి రెడ్డి ఎంత పిచ్చిగా మహేష్‌ని అభిమానిస్తుందో అలాంటి వారు నిజజీవితంలో కోకోల్లలు.
ఇక అలాంటి మహేష్ ప్రేమలో సీనియర్ హీరోయిన్ టబూ పడబోతుందా? మహేష్‌కు ప్రేమబాణాలు వేస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక టబుది కూడా సామాన్యమైన సౌందర్యం కాదు. ఆమె అందానికి నిలువెత్తు నిదర్శనం. ఒడ్డు పొడవు, పొడవైన కాళ్లు, చక్కని ఫేస్ కట్. అద్భుతమైన ఫిజిక్స్ కలిగి ఉండే టబు 90 లలో సెక్సీ హీరోయిన్‌గా వెలిగిపోయింది.
ఇప్పటికీ ఆమె గ్లామర్ రోల్స్ చేస్తూనే ఉంది. హిందీలో సూపర్ హిట్ మూవీ అందాధూన్‌లో టబు నెగటివ్ షేడ్స్ ఉన్నా బోల్డ్ రోల్ చేసింది. ఆ చిత్రంలో మెయిన్ విలన్ టబునే. కొన్ని బెడ్ రూమ్ సన్నివేశాలలో కూడా హాట్‌గా నటించింది. ఐదు పదుల వయసు దాటిన టబు అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఎవర్ గ్రీన్ గ్లామర్ టబు సొంతం.
తాజాగా ఆమె అంధాదూన్ మూవీలో చేసిన తరహా పాత్రని మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కబోతోన్న మూవీలో చేస్తుందని లేటెస్ట్ టాక్. దర్శకుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో నటులను రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ హిట్ ‘అల వైకుంఠపురములో’ నటించిన టబును మహేష్ చిత్రం కోసం తీసుకొస్తున్నాడు. అల వైకుంఠపురములో చిత్రంలో ఆమె అల్లు అర్జున్ తల్లి పాత్ర చేసింది. కానీ ఈ మూవీలో మాత్రం ఆమె ఓ బోల్డ్ రోల్‌లో కనిపించనుందట.
కథలో కీలకమైన ఒక ఆంటీ పాత్ర ఆమె చేస్తుండగా.. ఆ పాత్ర తన మనసును మహేష్‌పై పారేసుకుంటుం దిట. అతనికి దగ్గర కావాలని ఆశపడే నెగటివ్ షేడ్స్ కలిగిన బోల్డ్ రోల్ చేస్తోందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇందులో పూజా హెగ్డే, మహేష్‌కి జోడిగా నటించనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకీ మహేష్‌పై టబు ఎందుకు మోజు పడుతుంది? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏమిటి? అనే వాటిని త్రివిక్రమ్ తనదైన శైలిలో చిత్రీకరించనున్నారని సమాచారం.