అత్యంత విషమంగా తార‌క‌ర‌త్న ఆరోగ్యం..! ఆస్ప‌త్రికి బాల‌కృష్ణ‌, కుటుంబ స‌భ్యులు

విధాత: టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో గ‌త 23 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై శ‌నివారం మ‌రోసారి వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శ‌నివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల అవుతుంద‌ని మీడియాలో వార్త‌లు ప్ర‌సారం అయ్యాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి బులెటిన్ విడుద‌ల కాలేదు. దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఇప్ప‌టికే న‌టుడు బాల‌కృష్ణ‌, […]

  • By: krs    latest    Feb 18, 2023 1:36 PM IST
అత్యంత విషమంగా తార‌క‌ర‌త్న ఆరోగ్యం..! ఆస్ప‌త్రికి బాల‌కృష్ణ‌, కుటుంబ స‌భ్యులు

విధాత: టాలీవుడ్ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో గ‌త 23 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య ప‌రిస్థితిపై శ‌నివారం మ‌రోసారి వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

శ‌నివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల అవుతుంద‌ని మీడియాలో వార్త‌లు ప్ర‌సారం అయ్యాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి బులెటిన్ విడుద‌ల కాలేదు. దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఇప్ప‌టికే న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి చేరుకున్నారు. గురువారం రోజు తార‌క‌ర‌త్న‌కు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. మెద‌డుకు సంబంధించిన చికిత్స కొన‌సాగుతుంద‌ని వైద్యులు తెలిపారు. కానీ శ‌నివారం నాటికి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Breaking: నంద‌మూరి తార‌క‌ర‌త్న క‌న్నుమూత‌