TELANGANA | సర్కార్ అదే పాట.. వరద నష్టం నివేదికపై గడువివ్వాలని హైకోర్టుకు అభ్యర్థన
TELANGANA | మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు విధాత: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్ పై హైకోర్టులో గురువారం హైకోర్టులో విచారణ కొనసాగింది. మరోసారి ప్రభుత్వం వరదలు, వర్షాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం హైకోర్టును రెండు రోజుల గడువు కోరింది. రెండు రోజుల్లో వరదలు , నివారణ చర్యలు, ఎక్స్ గ్రేషియాపై పూర్తి నివేదిక అందజేస్తామన్న తెలిపింది. ప్రభుత్వం నివేదిక అందజేసిన తరువాతనే తాము వాదనలు వినిపిస్తామని పిటిషనర్ స్పష్టం చేశారు. వరద […]

TELANGANA |
మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు
విధాత: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్ పై హైకోర్టులో గురువారం హైకోర్టులో విచారణ కొనసాగింది. మరోసారి ప్రభుత్వం వరదలు, వర్షాలపై సమగ్ర నివేదిక సమర్పించడానికి ప్రభుత్వం హైకోర్టును రెండు రోజుల గడువు కోరింది.
రెండు రోజుల్లో వరదలు , నివారణ చర్యలు, ఎక్స్ గ్రేషియాపై పూర్తి నివేదిక అందజేస్తామన్న తెలిపింది. ప్రభుత్వం నివేదిక అందజేసిన తరువాతనే తాము వాదనలు వినిపిస్తామని పిటిషనర్ స్పష్టం చేశారు. వరద ప్రభావం తో మోరంచ పల్లి గ్రామంలో మృతి చెందిన ఇద్దరి పేర్లు మరణించిన జాబితాలో చేర్చలేదని పిటీషనర్ హైకోర్టు దృష్టికి తీసుకవచ్చారు.
మహా లక్ష్మీ , సంజీవయ్య పేర్లు ను జాబితాలో చేర్చాలని పిటిషనర్ కోరారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రేపటి నుండి మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయని కేంద్రం హెచ్చరించిందని పిటీషనర్ పేర్కోన్నారు.
ఈసారి మరింత అప్రమత్తంగా ఉండి, ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.