డయాలసిస్‌లో తెలంగాణ అగ్రగామి: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న డయాలసిస్ వైద్య చికిత్స సేవల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స కేంద్రాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఆనాడు సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీరు కూడా సరిగ్గా దొరక్క తెలంగాణాలో కిడ్నీ వ్యాది ప్రబలిందన్నారు. కిడ్నీ వ్యాదిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ […]

విధాత: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న డయాలసిస్ వైద్య చికిత్స సేవల్లో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స కేంద్రాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఆనాడు సమైఖ్య పాలకుల నిర్లక్ష్యంతో మంచి నీరు కూడా సరిగ్గా దొరక్క తెలంగాణాలో కిడ్నీ వ్యాది ప్రబలిందన్నారు. కిడ్నీ వ్యాదిగ్రస్తులకు ఉచితంగా డయాలసిస్ సేవల్ని అందించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవల్ని అందించేలా వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు.
మారు మూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రసూతి వైద్యాన్ని అందించేలా వైద్య రంగాన్ని తీర్చి దిద్దారన్నారు. అనవసర ఆపరేషన్లు చేయకుండా, నార్మల్ డేలివరీలను పెంచి స్త్రీల ఆరోగ్యానికి పెద్దపీట వేశారన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా మెడికల్ హాబ్‌గా మారిందని, మెడికల్ కాలేజిల ఏర్పాటుతో సుపర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు అందుతున్నదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పి చైర్మన్ సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్,
కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ సీపీ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.