Telangana | జాతీయ స్థాయిలో.. తెలంగాణ పల్లెల సత్తా
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులు అందుకున్న ఆయా గ్రామాల సర్పంచ్‌లు మంత్రి ఎర్రబెల్లితో కలిసి అవార్డు ప్రదానోత్సవం పాల్గొన్న ఆయా జిల్లాల కలెక్టర్లు 2023 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన 46 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులు ఎనిమిది విభాగాల్లో నాలుగింటిలో ప్రత్యేక కేటగిరీలో మొదటి స్థానం విధాత: జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలంగాణ (Telangana) పల్లెలు రాష్ట్రపతి చేతుల మీదుగా పంచాయతీరాజ్ అవార్డులు అందుకున్నాయి. 2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 అవార్డుల్లో తెలంగాణ […]

- ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులు అందుకున్న ఆయా గ్రామాల సర్పంచ్‌లు
- మంత్రి ఎర్రబెల్లితో కలిసి అవార్డు ప్రదానోత్సవం పాల్గొన్న ఆయా జిల్లాల కలెక్టర్లు
- 2023 సంవత్సరానికి కేంద్రం ప్రకటించిన 46 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులు
- ఎనిమిది విభాగాల్లో నాలుగింటిలో ప్రత్యేక కేటగిరీలో మొదటి స్థానం
విధాత: జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలంగాణ (Telangana) పల్లెలు రాష్ట్రపతి చేతుల మీదుగా పంచాయతీరాజ్ అవార్డులు అందుకున్నాయి. 2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 46 అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులు దక్కాయి. ఎనిమిది విభాగాల్లో నాలుగింటిలో ప్రత్యేక కేటగిరీలో మొదటి స్థానం లభించింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు అవార్డులు అందుకున్నారు.
కేంద్ర పంచాయతీరాజ్ 2023 సంవత్సరానికి ప్రకటించిన జాతీయ అవార్డులకు ఎంపికైన గ్రామ పంచాయతీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాయి. దేశంలోని అన్నిరాష్ట్రాలకు 46 అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా 13 అవార్డులు లభించాయి.
తెలంగాణ దేశంలోని అన్నిరాష్ట్రాలలోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. దీన్‌దయాల్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 27 అవార్డులు ప్రకటిస్తే.. అందులో ఏకంగా 8 అవార్డులు తెలంగాణకు దక్కడం గమనార్హం. మొత్తం తొమ్మిది కేటగిరీలు ఉండగా.. అందులో నాలుగు విభాగాల్లో రాష్ట్రానికే మొదటి స్థానం దక్కింది.
హెల్తీ కేటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్, వాటర్ సఫిఫియెంట్ విభాగంలో జనగాం జిల్లా నెల్లుట్ల, సోషియల్లీ సెక్యూర్డ్ విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్‌పల్లి, ఉమెన్ ఫ్రెండ్లీలో సూర్యాపేట జిల్లా ఐపూర్ మొదటి స్థానాలు దక్కించుకున్నాయి. పావర్టీ ఫ్రీలో జోగులాంబ గద్వాల జిల్లా మాన్‌దొడ్డి రెండో స్థానం, గుడ్ గవర్నెన్స్ వికారాబాద్ జిల్లా చీమల్‌దర్రీలు రెండోస్థానం నిలిచి అవార్డులు దక్కించుకున్నాయి.
అలాగే పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీర్‌రావు పేట, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, అవార్డులకు ఎంపికయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే, రంగారెడ్డి జిల్లా కన్హాతో పాటు మరికొన్ని గ్రామాలకు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు, సర్పంచ్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వీరంతా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.