Manipur | మణిపూర్‌లో చల్లారని ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
Manipur | మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది. భయానక వాతావరణం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. […]

Manipur |
మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది. భయానక వాతావరణం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.
ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ విధించడాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు.
मणिपुर जल रहा है। मोदी जी की जुबान पर आज तक मणिपुर का “म” भी नहीं आया है। कितने गैर जिम्मेदार और नाकारा प्रधानमंत्री है। धिक्कार है। #ManipurBurning pic.twitter.com/A3yDMPxol2
— Hansraj Meena (@HansrajMeena) June 15, 2023
కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలోనూ ఆందోళనకారులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. అయితే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిన్న జరిగిన దాడిని మాత్రం అడ్డుకోలేక పోయామని ఎస్కార్ట్ కమాండర్ దినేశ్వర్ సింగ్ పేర్కొన్నారు. అన్ని వైపుల నుంచి పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో వారిని నివారించడం కష్టమైందన్నారు.
మణిపూర్‌లో ఈ ఏడాది మే 3వ తేదీన రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం విదితమే. మైతీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నాగాలు, కుకీ సామాజికవర్గానికి చెందినవారు వ్యతిరేకిస్తున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో దాదాపు 120 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 350 మందికి పైగా గాయపడ్డారు.
What more proof do you want of the failure of Narendra Modi and Amit Shah? Both are useless characters.
One of Our states is burning and both are hibernated, playing ED CBI with opposition parties. Thooooo pic.twitter.com/fv4zlYmOe2
— Bhavika Kapoor ✋ (@BhavikaKapoor5) June 15, 2023