Singareni: సింగరేణిలో ఎండల తీవ్రత.. కార్మికులు విలవిల
వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న పర్మినెంట్, కాంట్రాక్ట్, కార్మికులు యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవాలని AITUC డిమాండ్ విధాత బ్యూరో, కరీంనగర్: వేసవి తీవ్రతతో అల్లాడిపోతున్న సింగరేణిలోని పర్మినెంటు, కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాలను కాపాడేందుకు యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ డిమాండ్ చేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగి పోతుండడంతో గనులన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా పనులు చేయలేక పర్మినెంటు,కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని […]

- వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న పర్మినెంట్, కాంట్రాక్ట్, కార్మికులు
- యాజమాన్యం ముందస్తు చర్యలు తీసుకోవాలని AITUC డిమాండ్
విధాత బ్యూరో, కరీంనగర్: వేసవి తీవ్రతతో అల్లాడిపోతున్న సింగరేణిలోని పర్మినెంటు, కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాలను కాపాడేందుకు యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ డిమాండ్ చేశారు.
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగి పోతుండడంతో గనులన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా పనులు చేయలేక పర్మినెంటు,కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వేసవిలో గనుల్లో వేడిమిని తగ్గించడానికి, కార్మికులు పని చేసుకునేలా వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం ముందస్తు చర్యలను తీసుకోవాలని ఆయన కోరారు.
బొగ్గు ఉత్పత్తి పై దృష్టి పెడుతున్న మాదిరిగానే, కార్మికుల సంక్షేమాన్ని కూడా యాజమాన్యం పట్టించు కోవాలని అన్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే చోట్ల ఏసీ సౌకర్యంతో రెస్ట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని, మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆదేశాలాను అమలు చేయాలని ఆయన సూచించారు.
సింగరేణి అన్ని ఏరియాలో ఏసీ షెల్టర్లు ఏర్పాటు చేయాలని, అలాగే డంపర్స్, షెవల్స్, డోజర్స్ వంటి భారీ వెహికల్స్‌లో ఏసీ ఉన్నా ఆ కార్మికులు బయటకు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకునేందుకు రెస్ట్ షెల్టర్లు, కూలర్లు ఉండాలని అన్నారు.
సర్ఫేస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్‌లు, అలాగే ఓపెన్ కాస్ట్ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. కేవలం బొగ్గు ఉత్పత్తిపై మాత్రమే దృష్టి పెట్టకుండా యాజమాన్యం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు.