OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడి మాములుగా లేదు.. ఏకంగా 30కి పైగా సినిమాలు..
OTT Movies | విధాత: ఇటీవల ఆడియన్స్‌కి థియేటర్స్ కన్నా ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఓటీటీలో ఏయే సినిమాలు విడుదల అవుతాయి, ఏయే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయనే దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ మూడో వారంలో ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాల్లో భోళా శంకర్ కూడా ఉంది. దీనిపై అందరిలో చాలా ఆసక్తి […]

OTT Movies |
విధాత: ఇటీవల ఆడియన్స్‌కి థియేటర్స్ కన్నా ఓటీటీ కంటెంట్‌పై ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఓటీటీలో ఏయే సినిమాలు విడుదల అవుతాయి, ఏయే వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయనే దానిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ మూడో వారంలో ఏకంగా 30కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాల్లో భోళా శంకర్ కూడా ఉంది. దీనిపై అందరిలో చాలా ఆసక్తి ఉంది.థియేటర్‌లో నిరాశపరచిన ఈ సినిమా ఓటీటీలో ఎంతగా అలరిస్తుందనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ లో వైఫ్ లైక్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 11, క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) – సెప్టెంబరు 13, రెజ్లర్స్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 13, వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ సినిమా) – సెప్టెంబరు 14, రామబాణం (తెలుగు) – సెప్టెంబరు 14, భోళా శంకర్ (తెలుగు) – సెప్టెంబరు 15, ఇన్‌సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15, మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 15, ఎల్ కొండే (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 15, సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. కెల్సీ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 12, ద కిడ్నాపింగ్ డే (కొరియన్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 13, బంబై మేరీ జాన్ (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 14, ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 15, వైల్డర్‌నెస్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15, అనీతి (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహాలో మాయపేటిక (తెలుగు ) – సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ అవుతుంది.
Abhiram | దగ్గుబాటి వారింట పెళ్లి సందడి.. రానా తమ్ముడి వివాహం ఆ అమ్మాయితోనే..!
ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఎలిమెంటల్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 13, ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 13, హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 13, వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ) – సెప్టెంబరు 13, కాలా (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 15, ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబరు 15, ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లిష్ సినిమా) -సెప్టెంబరు 15 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ఇక బుక్ మై షోలో బార్బీ (ఇంగ్లిష్ చిత్రం) – సెప్టెంబరు 12, ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లిష్ సినిమా ) – సెప్టెంబరు 15 సైనా ప్లే, పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ సినిమా) – సెప్టెంబరు 14 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక సోనీ లివ్ లో జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ సినిమా) – సెప్టెంబరు 15, ఈటీవీ విన్ లో దిల్ సే (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబరు 16 నుండి స్ట్రీమింగ్ కానుంది.
RGV:పవన్ నా సినిమా పోస్టర్ చూసే అలా రోడ్డుపైన పడుకున్నాడంటూ వర్మ సెటైర్