అజారుద్దీన్‌, క్రీడా మంత్రి చెప్పే విష‌యాల్లో పొంత‌న లేదు

విధాత: అజారుద్దీన్‌, క్రీడా మంత్రి చెప్పే విష‌యాల్లో పొంత‌న లేద‌ని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​ కుమార్‌ గౌడ్ అన్నారు. హెచ్​సీఏ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారం హైదరాబాద్ ఇమేజ్‌ దెబ్బతీస్తుందని విమర్శించారు. ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయో స్పష్టత ఇవ్వాల‌ని పేర్కొన్నారు. దోషులు ఎవ‌రున్నా శిక్షించాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం అండ‌దండ‌ల వ‌ల్లే ఈ త‌తంగ‌మంతా జ‌రుగుతున్న‌ద‌ని ఆయ‌న […]

  • By: krs    latest    Sep 24, 2022 1:52 PM IST
అజారుద్దీన్‌, క్రీడా మంత్రి చెప్పే విష‌యాల్లో పొంత‌న లేదు

విధాత: అజారుద్దీన్‌, క్రీడా మంత్రి చెప్పే విష‌యాల్లో పొంత‌న లేద‌ని కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​ కుమార్‌ గౌడ్ అన్నారు. హెచ్​సీఏ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి క్రీడాకారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారం హైదరాబాద్ ఇమేజ్‌ దెబ్బతీస్తుందని విమర్శించారు.

ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయో స్పష్టత ఇవ్వాల‌ని పేర్కొన్నారు. దోషులు ఎవ‌రున్నా శిక్షించాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. పోలీసులు ఎందుకు లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం అండ‌దండ‌ల వ‌ల్లే ఈ త‌తంగ‌మంతా జ‌రుగుతున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు. వ్య‌క్తులు, పార్టీల‌తో సంబంధం లేకుండా దోషుల‌ను శిక్షించాల‌న్నారు.

క్రీడాకారుల‌కు, అభిమానుల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ప్ర‌భుత్వం, హెచ్‌సీఏ విఫ‌ల‌మైంద‌న్నారు. రేప‌టి మ్యాచ్ స‌జావుగా జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు లేద‌న్నారు. అలాగే పీసీసీ డెలిగేట్స్ విషయంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

వాహ‌నాల కోసం ప్ర‌త్యేక పార్కింగ్

స్టేడియానికి వ‌చ్చే వాహ‌నాల కోసం ప్ర‌త్యేక పార్కింగ్ సౌక‌ర్యం క‌ల్పించారు. వీవీఐపీలు, వీఐపీలు గేటు 1 నుంచి ప్ర‌వేశించేలా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం స్టేడియం స‌మీపంలోని ఏ, సీ వ‌ద్ద ఏర్పాట్లు చేశారు.

సీనియ‌ర్ పోలీస్ అధికారులు కూడా గేట్ నం 1 నుంచి వెళ్లాలి. పాసులు క‌లిగిన వాళ్ల‌కు పాత ఎమ్మార్వో ఆఫీస్ వ‌ద్ద పార్కింగ్ చేసుకోవాలి. 4 వేల‌కు పైగా కార్లు, 5 వేల‌కు పైగా బైకులు నిలిపేలా స్థ‌లం కేటాయించారు.