తోటలో.. త‌వ్విన కొద్దీ బంగారం.. వాటిని రైతు ఏం చేశాడంటే!

విధాత: ప‌ది రూపాయ‌లు దొరికితేనే మ‌లిచి జేబులో పెట్ట‌కుంటున్నరోజుల్లో త‌న భూమిలో బంగారు నిధి ఉన్న లంకె బిందె దొరికితే ప్ర‌భుత్వానికి అంద‌జేశాడు ఓ సామాన్యుడు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామంలో సత్య నారాయణ అనే రైతు తన వ్య‌వ‌సాయ భూమిలో ఆయిల్‌ పామ్‌ తోట ఏర్పాటుకు ప‌నులు చేప‌ట్టాడు. ప‌నుల్లో భాగంగా నీటి పైపులు వేయటం కోసం భూమిని త‌వ్వుతుండ‌గా లంకె బిందె లాంటి ఒక కుండ దొరికింది. దాన్ని […]

  • By: krs    latest    Dec 04, 2022 2:48 AM IST
తోటలో.. త‌వ్విన కొద్దీ బంగారం.. వాటిని రైతు ఏం చేశాడంటే!

విధాత: ప‌ది రూపాయ‌లు దొరికితేనే మ‌లిచి జేబులో పెట్ట‌కుంటున్నరోజుల్లో త‌న భూమిలో బంగారు నిధి ఉన్న లంకె బిందె దొరికితే ప్ర‌భుత్వానికి అంద‌జేశాడు ఓ సామాన్యుడు.

వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామంలో సత్య నారాయణ అనే రైతు తన వ్య‌వ‌సాయ భూమిలో ఆయిల్‌ పామ్‌ తోట ఏర్పాటుకు ప‌నులు చేప‌ట్టాడు. ప‌నుల్లో భాగంగా నీటి పైపులు వేయటం కోసం భూమిని త‌వ్వుతుండ‌గా లంకె బిందె లాంటి ఒక కుండ దొరికింది.

దాన్ని పగుల కొట్టి చూస్తే 18 బంగారు నాణేలు బయటపడ్డాయి. వెంటనే ఆ రైతు స్థానిక ప్రభుత్వ అధికారులకు ఈ విషయం తెలియజేయగా తహసీల్దార్ పి.నాగమణి ఆయిల్‌పామ్‌ తోటను పరిశీలించారు. దొరికిన ఆ కుండ రెండు శతాబ్దాల క్రితం నాటిదని, బంగారు నాణెం ఒక్కొక్కటి 8 గ్రాములున్నదని ఆమె తెలిపారు. దొరికిన బంగారు నాణేలను రహస్యంగా దాచుకొనే ప్రయత్నం చేయకుండా.. ప్రభుత్వానికి తెలియజేసిన రైతును తహసీల్దార్‌ అభినందించారు.