వెంచర్‌లో గోతిలో పడి.. ముగ్గురు చిన్నారులు మృతి
విధాత: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి సోలీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. నిర్లక్ష్యంగా తీసిన గోతులు ముగ్గురు చిన్నారులను బలి తీసుకున్నాయి. దసరా సెలవులు, బతుకమ్మ వేడుకల వేళ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆడుకోవడానికి వెళ్లిన తమ పిల్లలు విగతజీవుగా మారడాన్ని చూసి బోరున విలపించారు. నీటి గుంతలో పడి పదేళ్ల లోపు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు అక్షిత్‌గౌడ్, ఫరీద్, పర్వీన్‌గా గుర్తించారు. గ్రామస్థులు నీటి గుంతలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. సోలీపూర్ […]

విధాత: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధి సోలీపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. నిర్లక్ష్యంగా తీసిన గోతులు ముగ్గురు చిన్నారులను బలి తీసుకున్నాయి. దసరా సెలవులు, బతుకమ్మ వేడుకల వేళ మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
ఆడుకోవడానికి వెళ్లిన తమ పిల్లలు విగతజీవుగా మారడాన్ని చూసి బోరున విలపించారు. నీటి గుంతలో పడి పదేళ్ల లోపు ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు అక్షిత్‌గౌడ్, ఫరీద్, పర్వీన్‌గా గుర్తించారు. గ్రామస్థులు నీటి గుంతలో నుంచి మృతదేహాలను వెలికితీశారు.
సోలీపూర్ గ్రామంలో ఉన్న వెంచర్‌లో ఆడుకుంటున్న అక్షిత్‌గౌడ్, ఫరీద్, పర్వీన్‌లతో పాటు ఇంకో బాలుడు అక్కడే ఉన్న గోతుల వద్దకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిండుకుండల్లా ఉన్న గోతుల వద్దకు వెళ్లగా ఈ ముగ్గురిలో ఒకరు గోతిలో దిగడానికి ప్రయత్నించాడు.
నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడటానికి మిగిలిన ముగ్గురు పట్టుకుని నీటిలో పడిపోయారు. ఇలా అక్షిత్, ఫరీద్, పర్వీన్‌లు నీటిలో మునిగిపోగా మరో బాబు అతి కష్టం మీద బైటపడ్డాడు. బాలుడు ఇచ్చిన సమాచారంతో గ్రామస్థులు నీటి గుంతలో నుంచి మృతదేహాలను వెలికితీశారు.