సీపీఎస్ ర‌ద్దు కోసం ఉద్య‌మం: టీఎన్జీఓ

సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ఫిబ్ర‌వ‌రి 16న దేశ వ్యాప్త స‌మ్మెను విజ‌య‌వంతం చేద్దామ‌ని ఉద్యోగుల‌కు టీఎన్జీఓ పిలుపు ఇచ్చింది.

సీపీఎస్ ర‌ద్దు కోసం ఉద్య‌మం: టీఎన్జీఓ
  • ఫిబ్ర‌వ‌రి 16 జాతీయ స‌మ్మెను విజ‌య‌వంతం చేద్దాం
  • ఉద్యోగుల‌కు పిలుపు ఇచ్చిన టీఎన్జీఓ


విధాత‌: సీపీఎస్ విధానం ర‌ద్దు చేయాల‌ని కోరుతూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేర‌కు ఫిబ్ర‌వ‌రి 16న దేశ వ్యాప్త స‌మ్మెను విజ‌య‌వంతం చేద్దామ‌ని ఉద్యోగుల‌కు టీఎన్జీఓ పిలుపు ఇచ్చింది. ఈ మేర‌కు జాతీయ స‌మ్మెలో పాల్గొనాల‌ని కోరుతూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్య‌క్షులు సుభాష్ లంబ బుధ‌వారం హైద‌రాబాద్‌లో టీఎన్జీఓ కార్యాల‌యంలో జాతీయ స‌మ్మె సాధ‌న స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఉపాధ్యక్షులు టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, కేంద్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, జాతీయ కార్య వర్గ సభ్యులు లక్ష్మణ్, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


ఈసంద‌ర్భంగా సుభాష్ లంబ మాట్లాడుతూ.. డిసెంబర్ 28 29 30 తేదీలలో కోల్ క‌త్తాలో జ‌రిగిన‌ జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాన్ని అనుసరించి సీపియస్ రద్దు, ఉద్యోగుల ఆదాయపు పన్నురూ. 10 లక్షలకు పెంపు, పెండింగ్ డీఏల మంజూరు, ప్రభుత్వ శాఖల్లో ఖాలీల భర్తీ, ప్రైవేటీకరణ రద్దు, కార్మిక చట్టాల రద్దును వ్యతిరేకంగా, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులర్ చేయడం లాంటి అనేక డిమాండ్ ల పరిష్కారం తెలంగాణ ఎన్జీవోల సంఘం పక్షాన 33 జిల్లాల్లో జాతీయ సమ్మె ను విజయవంతం చేయాలని ఆయ‌న కోరారు. మారం జగదీశ్వర్ మాట్లాడుతూ జాతీయ కౌన్సిల్ తీర్మానం మేరకు ఫిబ్రవరి 16 న ఒక రోజు జాతీయ సమ్మెను విజయవంతం చేస్తామ‌న్నారు.