Hyderabad | హైదరాబాద్‌లో విషాదం.. కవలలను 8వ అంతస్తు నుంచి తోసేసి తల్లి ఆత్మహత్య
Hyderabad విధాత: హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్‌పేటలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల భవనం 8వ అంతస్తు నుంచి కవల పిల్లలను కిందకు తోసేసి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్లే.. గాంధీ నగర్‌కు చెందిన గణేశ్‌కు రెండేండ్ల క్రితం సౌందర్య అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కొన్ని నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. కుమారుడి పేరు నిదర్శన్, కూతురు పేరు నిత్యగా […]

Hyderabad
విధాత: హైదరాబాద్ నగరంలోని బన్సీలాల్‌పేటలో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల భవనం 8వ అంతస్తు నుంచి కవల పిల్లలను కిందకు తోసేసి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్లే.. గాంధీ నగర్‌కు చెందిన గణేశ్‌కు రెండేండ్ల క్రితం సౌందర్య అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కొన్ని నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. కుమారుడి పేరు నిదర్శన్, కూతురు పేరు నిత్యగా నామకరణం చేశారు. ఇదిలా ఉంటే.. అందంగా లేవని గణేశ్ తన భార్య సౌందర్యను వేధింపులకు గురి చేసేవాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలని ఒత్తిడి చేసి, మానసికంగా వేధించాడు.
దీంతో సౌందర్య తల్లిదండ్రులు ఇటీవలే ఓ ప్లాట్ కూడా రాసిచ్చారు. ఈ ప్లాట్ కూడా సరిపోదని నగదు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. భర్త వేధింపులు భరించలేక సౌందర్య.. తన అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల భవనం 8వ అంతస్తు నుంచి మొదట ఇద్దరు పిల్లలను తోసేసింది. అనంతరం ఆమె కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ముగ్గురి మృతదేహాలను ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.