పారదర్శకంగా గురుకుల బోర్డు నియామకాలు చేప‌ట్టాం

గురుకుల బోర్డు ద్వారా జరిగిన నియామాకాలు 100 శాతం పారదర్శకంగా, నిబద్ధతతో జరిగాయని, ఈ విషయంలో వివిధ మాధ్యమాలలో వస్తున్న వార్తలు అభ్యర్థులను తప్పు ద్రోవ పట్టించే విధంగా ఉన్నాయని TREIRB చైర్మన్ ఆయేషా మసరత్ ఖానం వెల్లడించారు

పారదర్శకంగా గురుకుల బోర్డు నియామకాలు చేప‌ట్టాం
  • భ‌ర్తీ కానీ పోస్టులు క్యారీ ఫార్వ‌ర్డ్
  • టీఆర్ఇఐఆర్‌బీ చైర్మ‌న్ ఆయేషా మ‌స‌ర‌త్ ఖానం


విధాత‌: గురుకుల బోర్డు ద్వారా జరిగిన నియామాకాలు 100 శాతం పారదర్శకంగా, నిబద్ధతతో జరిగాయని, ఈ విషయంలో వివిధ మాధ్యమాలలో వస్తున్న వార్తలు అభ్యర్థులను తప్పు ద్రోవ పట్టించే విధంగా ఉన్నాయని TREIRB చైర్మన్ ఆయేషా మసరత్ ఖానం వెల్లడించారు. అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా డి ఎల్ మరియు జే ఎల్ ఫలితాలను ఇవ్వటం జరిగిందని అన్నారు.. డి ఎల్, జే ఎల్ 1:2 లిస్టును ఫిబ్రవరి 15, 16వ తేదీలలో వెబ్ సైట్ నందు పొందుపరచటం జరిగింది. డెమో తేదీలను కూడా అదే రోజు ప్రకటించి ఫిబ్రవరి 19 నుండి 22 వరకు డెమోలను కండక్ట్ చేయటం జరిగింది.


డెమోలను కండక్ట్ చేయగానే వెంటనే ఫలితాలను ఫిబ్రవరి 28వ తేదీ డి ఎల్ ఫలితాలను 29వ తేదీన జే ఎల్ ఫలితాలను ప్రకటించామని వివరించారు.. ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండానే మార్చి 4వ తేదీన వెంటనే అభ్యర్ధులకు నియామక పత్రాలను అందించడం జరిగిందని, అమలులో ఉన్న నిబంధనల మేరకు అన్ని రిజర్వేషన్లు పాటించి పారదర్శకంగా ఎంపికలు జరిపామని తెలియ చేశారు.. అభ్యర్థులకు ఏవిధమైన ఇబ్బంది కలుగకుండా నియామకాల ప్రక్రియ మొదలు పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఫలితాలను ప్రకటించామని ఐషా మసరత్ ఖానం వెల్లడించారు. మధ్యవర్తులను పైరవికారులకు అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు..


నోటిఫికేషన్ లో రూపొందించిన ఫార్మెట్‌లోనే మార్కుల గురించి తెలిపామన్నారు. మార్కుల మెమోలను నెల రోజుల తర్వాత నుండి 90 రోజుల వరకు ట్రిబ్ వెబ్ సైట్ ద్వారా పొందుటకు అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఆన్ లైన్ ద్వారా రూ.200 పే చేస్తే మార్కుల మేమో ఇస్తామని తెలిపారు. డి ఎల్ మరియు జే ఎల్ లు మల్టీజోను స్థాయి పోస్టులను నిబంధనల మేరకు రిజర్వేషన్ పద్ధతి ఆయా గురుకుల సంస్థలు ఇచ్చిన ఇన్ డెంట్ ను పాటించి ఎంపిక చేయడం జరిగిందని తెలియచేసారు. డెమో నియమ నిబంధనలను పాటించనని వారికి గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో సమయము పరిశీలించాల్సిన వివిధ అంశాలను కూడా పేర్కొనడం జరిగిందన్నారు.


వైట్ బోర్డులు, మార్కర్ పెన్నులు, డెమోకు అవసరమైన వాటిని ప్రతి బోర్డులో అందుబాటులో ఉంచడమైనది. ఏ బోర్డులో ఎవరు ఉంటారనే విషయాన్ని, ఏ అభ్యర్ధులు ఏ బోర్డుకు వెళ్తారనే అంశాన్ని చివరి నిమిషాన నిర్ణయించటం జరిగింది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను తెలుపకుండా కేవలం హాల్ టికెట్ల నెంబర్లను మాత్రమే బోర్డుకు అందించడం జరిగింది. నోటిఫికేషన్ నెం.02/2023, తేదీ: 05-04-2023 ప్రకారం సారా-V(1)లో జి.ఓ.ఎమ్.ఎస్.నెం.81, 1997 ప్రకారము వెయిటింగ్ లిస్టు విధానము లేద‌ని భర్తీ కాని, జాయినింగ్ కాని ఖాళీలు క్యారిఫార్వడ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని TREIRB చైర్మన్ ఐషా మసరత్ ఖానం, ఐఏఎస్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.