టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈడీ షాక్..9 గంట‌లు విచార‌ణ‌

విధాత‌, హైద‌రాబాద్: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు 9 గంటలు పాటు ఆయనను విచారించారు. అయన ఇచ్చిన స్టేట్‎మెంట్‎ను రికార్డు చేసుకున్నారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు సమాచారం. నిన్న మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయగా ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయనకు నోటీసులు […]

  • By: Somu    latest    Sep 27, 2022 12:46 PM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఈడీ షాక్..9 గంట‌లు విచార‌ణ‌

విధాత‌, హైద‌రాబాద్: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి హైదరాబాద్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్ కార్యాలయంలో ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారులు 9 గంటలు పాటు ఆయనను విచారించారు. అయన ఇచ్చిన స్టేట్‎మెంట్‎ను రికార్డు చేసుకున్నారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించినట్టు సమాచారం.

నిన్న మంచిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయగా ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే వరకూ ఆయనకు నోటీసులు వచ్చిన విషయం కూడా బయటకు తెలియలేదు. దీంతో ఆయనను ఏ కేసులో విచారణకు పిలిచారన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ అధికారులు హైదరాబాద్‌ అంతటా విస్తృతమైన సోదాలు నిర్వహించింది. ఈ కారణంగా ఎక్కువ మంది ఈ కేసులోనే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పిలిచి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కానీ ఆయనకు సంబంధం ఉన్న కంపెనీల పేర్లు కానీ ఎక్కడా బయట ప‌డ‌లేదు.