15న TRSLP, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం
TRSLP | ఈ నెల 15వ తేదీన టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గుజరాత్ ఎన్నికల ప్రచారంపై కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో […]

TRSLP | ఈ నెల 15వ తేదీన టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గుజరాత్ ఎన్నికల ప్రచారంపై కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సందర్భం వచ్చినప్పుడల్లా మోదీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసి వచ్చే పార్టీలతో పోరాడుతానని కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లో మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగబోయే టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం కీలకం కానుంది.