TSPSC కీలక ప్రకటన.. ఐదు నోటిఫికేషన్ల పరీక్షలకు కొత్త తేదీల ప్రకటన
టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకనట చేసింది. ఈ నెల, వచ్చే నెలలో జరగాల్సిన ఐదు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలను వాయిదా వేసింది. ఆ ఐదు ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను మే, జూన్, జులై నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. మే 16వ తేదీన అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, మే 19న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, జులై 18, […]

టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకనట చేసింది. ఈ నెల, వచ్చే నెలలో జరగాల్సిన ఐదు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలను వాయిదా వేసింది. ఆ ఐదు ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలను మే, జూన్, జులై నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.
మే 16వ తేదీన అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, మే 19న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, జూన్ 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, జులై 18, 19వ తేదీల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టులకు, జులై 20న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. తదితర వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.