Fox Con l తుస్సుమన్న ఫాక్స్ కాన్.. తెలంగాణలో పెట్టుబ‌డులు నో!

Fox Con, KCR, TELANGANA, KTR విధాత: తాజాగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫాక్స్ ఛైర్మన్ యాంగ్ లీయు భేటీ అయిన తరువాత ప్రచార, ప్రసార మాద్యమాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారనే వార్తలు పతాక శీర్షికల్లో చోటు చేసుకున్నాయి. రెండు రాష్ట్రాలు లక్ష మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు వస్తాయని, వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఊదరగొట్టాయి. ప్రస్తుతానికి చర్చలు మాత్రమే: యాంగ్ లియు ఈ వార్తలను చూసి అందరూ నిజమేననుకున్నారు. దీనికి […]

Fox Con l తుస్సుమన్న ఫాక్స్ కాన్.. తెలంగాణలో పెట్టుబ‌డులు నో!

Fox Con, KCR, TELANGANA, KTR

విధాత: తాజాగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫాక్స్ ఛైర్మన్ యాంగ్ లీయు భేటీ అయిన తరువాత ప్రచార, ప్రసార మాద్యమాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారనే వార్తలు పతాక శీర్షికల్లో చోటు చేసుకున్నాయి. రెండు రాష్ట్రాలు లక్ష మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు వస్తాయని, వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఊదరగొట్టాయి.

ప్రస్తుతానికి చర్చలు మాత్రమే: యాంగ్ లియు

ఈ వార్తలను చూసి అందరూ నిజమేననుకున్నారు. దీనికి పూర్తి భిన్నంగా శనివారం నాడు ఫాక్స్ కాన్ (Fox Con) ఛైర్మన్ యాంగ్ లియు (Yang Liu) కీలక ప్రకటన చేశారు. భారత దేశ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు ఖరారు కాలేదని కంపెనీ ప్రకటించింది.

ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, అంతర్గతంగా సమీక్షించుకుంటున్నామని పేర్కొంది. రాష్ట్రాలలో పర్యటించాం తప్పితే అడుగు ముందుకు కూడా పడలేదని పరోక్షంగా వెల్లడించడం గమనార్హం. ప్రచార, ప్రసార సాధనాల్లో హోరెత్తిస్తున్న విధంగా వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

తెలంగాణ యువతకే దక్కేలా చర్యలు: CM KCR

ఫాక్స్ కాన్ ఛైర్మన్ ప్రకటనతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 4వ వరకు యాంగ్ లియు భారత్‌లో పర్యటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)తో గురువారం నాడు ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కెసిఆర్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడితో గతంలో లేని విధంగా లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంత వరకు తెలంగాణ యువతకే దక్కేలా చర్యలు చేపడతామన్నారు. ఫాక్స్ కాన్ సంస్థ తమ ప్రాజెక్టును నెలకొల్పడం పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

పదేళ్లలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు: మంత్రి KTR

ఐటి మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ఫాక్స్ కాన్ పెట్టుబడి ద్వారా రాబోయే పదేళ్లలో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం నాడు యాంగ్ లియు కర్ణాటకలో పర్యటించి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో భేటీ అయ్యారు.

బెంగళూరు ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టు సమీపంలో మూడు వందల ఎకరాల్లో ఏడు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. భారత దేశం నుంచి వెళ్లిన మరుసటి రోజే ఫాక్స్ కాన్ ఛైర్మన్ యాంగ్ లియు తెలంగాణ, కార్ణాకటలో పెట్టుబడులు లేవు గిట్టుబడులు లేవంటూ ప్రకటన చేయడం గమనించ దగ్గ విషయం.