ఆ ట్వీట్ చేసింది.. నిజంగా బాలయ్య వారసుడేనా?

విధాత: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి ఎన్టీఆర్ ప్లేస్‌లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై పెద్ద వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. నందమూరి వారసులంతా దీనిని వ్యతిరేకిస్తూ.. ఎవరికి తోచినట్లుగా వారు ఫైర్ అయ్యారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌పై కూడా రాద్ధాంతం జరుగుతోంది. ఇక కాస్త లేటుగా స్పందించినా.. బాలయ్య తనదైన తరహాలో వైసీపీపై వీరలెవల్లో చెలరేగిపోయాడు. ‘‘మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు […]

  • By: krs    latest    Sep 27, 2022 7:30 PM IST
ఆ ట్వీట్ చేసింది.. నిజంగా బాలయ్య వారసుడేనా?

విధాత: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి ఎన్టీఆర్ ప్లేస్‌లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై పెద్ద వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. నందమూరి వారసులంతా దీనిని వ్యతిరేకిస్తూ.. ఎవరికి తోచినట్లుగా వారు ఫైర్ అయ్యారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌పై కూడా రాద్ధాంతం జరుగుతోంది. ఇక కాస్త లేటుగా స్పందించినా.. బాలయ్య తనదైన తరహాలో వైసీపీపై వీరలెవల్లో చెలరేగిపోయాడు.

‘‘మార్చేయడానికి తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మిల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త.
అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’’ అంటూ బాలయ్య ఫేస్ బుక్ వేదికగా.. పేరు మార్చడాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

బాలయ్య ఈ పోస్ట్ తర్వాత ఒక్కసారిగా వైసీపీ నేతలు ఆయనపై దండెత్తారు. తండ్రి బతికి ఉన్నప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందో అంటూ.. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఫైర్ అవుతున్నారు. అలా ఫైర్ అయ్యే వారందరికీ బాలయ్య కాదు కానీ.. ఆయన వారసుడు వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ ట్వీట్.. సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

మరి ఇది నిజంగా బాలయ్య వారసుడి అకౌంటో.. లేదంటే వేరే వాళ్లు ముసుగులో అలా చేస్తున్నారో తెలియదు.. కానీ.. ఓ రేంజ్‌లో వైసీపీ బ్యాచ్‌పై ఈ ట్వీట్‌లో మోక్షజ్ఞ గాండ్రించాడు.

-బాలయ్య మీద గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మొరుగుతున్నా కొన్ని కుక్కలకు.. మీరు ఎంత చేసిన బాలయ్య వెంట్రుక కూడా పీక్కోలేరు..

-అవసరం ఉన్నప్పుడు అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినవారే అవసరం తీరిపోయాక కారు కూతలు కూస్తే కాలమే సమాధానం చెప్తుంది.. అంటూ మోక్షజ్ఞ చేసినట్లుగా కనిపిస్తోన్న ఓ ట్వీట్.. టీడీపీ వర్గాలకు కొత్త బలాన్ని ఇస్తోంది.