భారత్‌లో ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌..!

Twitter Server Down| సాంకేతిక సమస్యలతో భారత్‌లో ఆదివారం ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో 1,747 మంది వినియోగదారులు ట్విట్టర్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. కొత్త ట్వీట్లు లోడ్‌ చేయడం, వెబ్‌సైట్‌, ట్వీట్‌ను అప్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరో వైపు శనివారం గూగుల్‌ జీ-మెయిల్స్‌ సర్వీసులు కొద్దిసేపు ప్రభావితమైన విషయం తెలిసిందే. చాలా మంది వినియోగదారులు […]

  • By: krs    latest    Dec 11, 2022 3:55 PM IST
భారత్‌లో ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌..!

Twitter Server Down| సాంకేతిక సమస్యలతో భారత్‌లో ఆదివారం ట్విట్టర్‌ సర్వర్‌ డౌన్‌ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌లో 1,747 మంది వినియోగదారులు ట్విట్టర్‌లో సమస్యలు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.

కొత్త ట్వీట్లు లోడ్‌ చేయడం, వెబ్‌సైట్‌, ట్వీట్‌ను అప్‌లోడ్‌ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. మరో వైపు శనివారం గూగుల్‌ జీ-మెయిల్స్‌ సర్వీసులు కొద్దిసేపు ప్రభావితమైన విషయం తెలిసిందే. చాలా మంది వినియోగదారులు సర్వర్ డౌన్ అయినట్లు ఫిర్యాదు చేశారు.

డెస్క్‌టాప్‌తో పాటు యాప్‌ వర్షెన్లలో సమస్యలు ఎదుర్కొన్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. గత జూలైలో ట్విట్టర్‌ సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. గత ఫిబ్రవరిలో రెండుసార్లు ట్విట్టర్‌ సేవలను నిలిచిపోవడంతో యూజర్స్‌ ఇబ్బందులకు గురయ్యారు.