దేశంలో కొత్త కొవిడ్‌ కేసులు 160.. ఇద్ద‌రు మృతి

దేశంలో కొవిడ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త‌వారం వ‌ర‌కు 200ల‌కుపైగా న‌మోదైన రోజువారీ కొత్త కేసుల సంఖ్య 200లోపు ప‌డిపోయింది

దేశంలో కొత్త కొవిడ్‌ కేసులు 160.. ఇద్ద‌రు మృతి
  • యాక్టివ్ కేసుల సంఖ్య 1,886
  • ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డి

విధాత‌: దేశంలో కొవిడ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌త‌వారం వ‌ర‌కు 200ల‌కుపైగా న‌మోదైన రోజువారీ కొత్త కేసుల సంఖ్య 200లోపు ప‌డిపోయింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 160 కొత్త కేసులు న‌మోద‌య్యారు. వీటితో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,886కు చేరింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో ఇద్ద‌రు చ‌నిపోయారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం 8 గంట‌ల‌కు బులెటిన్ విడుద‌ల చేసింది..

ఒక్క‌రోజులోనే దేశంలో రెండు కొత్త మరణాలు న‌మోద‌య్యాయి. కర్ణాటకలో ఒక‌రు, కేరళ మ‌రొక‌రు కొవిడ్‌తో చ‌నిపోయారు. 2023 డిసెంబర్ 5 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. చ‌లి వాతావరణ పరిస్థితుల తర్వాత కొవిడ్ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. డిసెంబర్ 31న‌ ఒక్క రోజులో 841 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మే 2021లో నమోదైన గరిష్ఠ‌ కేసుల్లో 0.2 శాతం అని అధికారికవర్గాలు తెలిపాయి.

2021 మే 7న గరిష్ఠంగా 4,14,188 కొత్త కేసులు, 3,915 మరణాలు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల్లో వీటిలో ఎక్కువ భాగం (సుమారు 92 శాతం) హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. 2020 ప్రారంభంలో క‌రోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉన్న‌ది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు.