Minister Vemula Prashanth Reddy | దేశంలో ఎక్కడా లేని విధంగా వరంగల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
డిసెంబర్ నాటికి ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తాం హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న 24 అంతస్థుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. హాస్పిటల్ డిజైన్లు,వర్క్స్ […]

- డిసెంబర్ నాటికి ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తాం
- హైదరాబాద్ నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న 24 అంతస్థుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. హాస్పిటల్ డిజైన్లు,వర్క్స్ ప్రోగ్రెస్ పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు అందాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వరంగల్లో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 42 ఎకరాల్లో, 19లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు 1200 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు.
ఈ హాస్పిటల్ వరంగ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30 నుంచి 35 విభాగాల ట్రీట్మెంట్ సేవలు అందనున్నాయని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్ చుట్టూ నాలుగు మల్టీ స్పెషాల్టీ హాస్పటల్ నిర్మాణం
హైదరాబాద్ చుట్టూ నాలుగు మల్టీ స్పెషాల్టీ హాస్పటల్ నిర్మాణం చేపడుతున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో హాస్పిటల్ 900 కోట్ల వ్యయంతో 1000 బెడ్ల సదుపాయంతో నిర్మిస్తున్నామన్నారు. నిమ్స్ హాస్పటల్లో కూడా 1600 కోట్లతో కొత్తగా 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా అన్ని జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,ఆర్ అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఎస్.ఈ నరేందర్ రావు,పలువురు అధికారులు,ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.