VH Hanumantha Rao | చలాన్‌లు అడిగితే తిరగబడండి: వీహెచ్
VH Hanumantha Rao జీహెచ్ఎంసీ వద్ద డబ్బు లేకపోతే.. నాంపల్లి దర్గా దగ్గర అడుక్కోండి! విధాత, హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేతలు కట్టిన ఫ్లెక్సీ లకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు అన్నారు. చలానాలు కట్టమని అడిగితే తిరగబడండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చలానాలు కట్టేదే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు 2 లక్షల 95 వేల జరిమానావేసారు, మున్సిపాలిటీల్లో డబ్బులు లేవా అని వీహెచ్ […]

VH Hanumantha Rao
- జీహెచ్ఎంసీ వద్ద డబ్బు లేకపోతే.. నాంపల్లి దర్గా దగ్గర అడుక్కోండి!
విధాత, హైదరాబాద్: సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేతలు కట్టిన ఫ్లెక్సీ లకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇవ్వటం దుర్మార్గమని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు అన్నారు. చలానాలు కట్టమని అడిగితే తిరగబడండని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చలానాలు కట్టేదే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు 2 లక్షల 95 వేల జరిమానావేసారు, మున్సిపాలిటీల్లో డబ్బులు లేవా అని వీహెచ్ ప్రశ్నించారు.
లేదంటే నాంపల్లి దర్గా దగ్గర కూర్చొని అడగండి.. మేమే డబ్బులు వేస్తామని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాష్ట్రానికి వస్తే మా నాయకులు స్వాగతం చెప్పడం తప్పా అని మండిపడ్డారు. బీఆరెస్ నాయకులు కట్టడంలేదా? వారికి వేయని చలానాలు మాకెందుకు వేస్తారని ప్రశ్నించారు. చలానాలు వాపస్ తీసుకోక పోతే జీహెచ్ఎంసీ ముందు ధర్నా చేస్తామన్నారు. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్తామన్నారు.