పార్టీ తీరుతో.. అయోమ‌యంలో విజ‌య‌శాంతి

అసంతృప్తిలో ఉన్న‌ట్టు ప‌లుమార్లు వార్త‌లు కొట్టిపారేసిన వైనం.. స‌ర్వాయి పాప‌న్న జ‌యంతి వేడుక‌లో తేట‌తెల్లం విధాత‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మాట్లాడుకుందామని అనుకున్నాను. లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు. తనకేమీ అర్థం కాలేదన్నారు. తన సేవలు ఎలా ఉపయోగించుకుంటారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కే తెలియాలి అన్నారు. […]

  • By: krs    latest    Nov 23, 2022 8:26 AM IST
పార్టీ తీరుతో.. అయోమ‌యంలో విజ‌య‌శాంతి
  • అసంతృప్తిలో ఉన్న‌ట్టు ప‌లుమార్లు వార్త‌లు
  • కొట్టిపారేసిన వైనం..
  • స‌ర్వాయి పాప‌న్న జ‌యంతి వేడుక‌లో తేట‌తెల్లం

విధాత‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తితో ఉన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందన్నారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మాట్లాడుకుందామని అనుకున్నాను. లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు. తనకేమీ అర్థం కాలేదన్నారు. తన సేవలు ఎలా ఉపయోగించుకుంటారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌కే తెలియాలి అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు.

బీజేపీ నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తితో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు జాతీయ స్థాయి నేతగా పేరొందిన ఆమె తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీని వీడి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి అనంతరం టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు.

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే సమయంలో టీఆర్‌ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు కేసీఆర్‌ కాగా, రెండో ఎంపీ విజయశాంతినే. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో ఆమె తిరిగి కాషాయ గూటికి చేరారు. పార్టీలో ఆమెకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదని బహిరంగంగా వ్యక్త పరచకున్నా అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నట్టు చాలా సార్లు వార్తలు వచ్చాయి, వస్తున్నాయి.

అయితే వాటిని ఎప్పటికప్పుడు విజయశాంతి కొట్టిపారేశారు. అయితే ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరచడం గమనార్హం.