Naga Babu | మ‌రోసారి స్నేక్ బాబు అంటూ విష్ణు సెటైర్స్.. త‌ర్వాత భ‌లే క‌వర్ చేశాడు..!

Naga Babu | మా ఎన్నిక‌లు రాజ‌కీయ ఎన్నిక‌ల‌ని త‌ల‌పించ‌డం మ‌నం చూశాం. ఈ ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ,మంచు ఫ్యామిలీ మ‌ధ్య వార్ గ‌ట్టిగా న‌డిచింది. మెగా ఫ్యామిలీ ప్ర‌కాశ్ రాజ్‌ని స‌పోర్ట్ చేసిన ఆయ‌న‌పై మంచు విష్ణు గెలిచి మా అధ్య‌క్షుడిగా ఉన్నారు. అయితే మా ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో త‌న‌పై నాగ‌బాబు ట్రోలింగ్ చేయించాడ‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు విష్ణు. తాజాగా మ‌రోసారి ఓ ఇంట‌ర్వ్యూలో త‌నపై ట్రోలింగ్ చేస్తుంది స్నేక్ బ్యాచ్ అంటూ కామెంట్ […]

  • By: sn    latest    Aug 21, 2023 1:48 AM IST
Naga Babu | మ‌రోసారి స్నేక్ బాబు అంటూ విష్ణు సెటైర్స్.. త‌ర్వాత భ‌లే క‌వర్ చేశాడు..!

Naga Babu |

మా ఎన్నిక‌లు రాజ‌కీయ ఎన్నిక‌ల‌ని త‌ల‌పించ‌డం మ‌నం చూశాం. ఈ ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో మెగా ఫ్యామిలీ,మంచు ఫ్యామిలీ మ‌ధ్య వార్ గ‌ట్టిగా న‌డిచింది. మెగా ఫ్యామిలీ ప్ర‌కాశ్ రాజ్‌ని స‌పోర్ట్ చేసిన ఆయ‌న‌పై మంచు విష్ణు గెలిచి మా అధ్య‌క్షుడిగా ఉన్నారు. అయితే మా ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో త‌న‌పై నాగ‌బాబు ట్రోలింగ్ చేయించాడ‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు విష్ణు.

తాజాగా మ‌రోసారి ఓ ఇంట‌ర్వ్యూలో త‌నపై ట్రోలింగ్ చేస్తుంది స్నేక్ బ్యాచ్ అంటూ కామెంట్ చేశాడు. స్నేక్ బ్యాచ్ అంటే అందరికి ముందుగా నాగ‌బాబు గుర్తొస్తుంది. అందుకు కార‌ణం నాగ‌బాబుని ఆయ‌న ప్రత్యర్ధులు స్నేక్ బాబు అని అంటుంటారు. వివాదాస్పద నటి శ్రీరెడ్డి కూడా.. నాగబాబుని స్నేక్ బాబు అంటూ త‌న పోస్ట్‌ల‌లో సెటైర్స్ పేలుస్తూ ఉంటుంది.

తాజాగా జాఫ‌ర్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. నేను పెద్ద‌గా ట్రోలింగ్ ప‌ట్టించుకోను. నాపైనే అంద‌రిపైన ట్రోలింగ్ న‌డుస్తుంది.అయితే మితిమీరి మాట్లాడితే స‌హించేది లేదు. కొన్ని పెయిడ్ బ్యాచ్‌లు డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తూ ఉంటారు.

అయిన నా ఒక్క‌డికే కాదు, ప్రభాస్‌కి అవ్వడం లేదా?? మహేష్ బాబుకి అవ్వడం లేదా? తారక్‌కి అవ్వడం లేదా? ఇలా అంద‌రిని ట్రోల్ చేస్తున్నారు. అస‌లు మా ఎల‌క్ష‌న్ ముందు వ‌ర‌కు నాపై అంత ట్రోలింగ్ జ‌రిగేది కాదు. ఎల‌క్ష‌న్స్ నుండే ట్రోల్ చేస్తున్నారు. అయిన అది ఎవ‌రు చేయిస్తున్నారో అంద‌రికి తెలుసు. అయిత‌న స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకు అన్నట్టు మంచు విష్ణు కామెంట్ చేశాడు.

మంచు విష్ణు స్నేక్ బాబు అని అనడంతో వెంట‌నే.. మీరు నాగబాబు గారి గురించే కదా అన్నారు’? అని జర్నలిస్ట్ జాఫర్ అని అన్నారు. అప్పుడు విష్ణు.. అలా అని మీరు అనుకుంటున్నారా, ఆ పెద్దాయ‌న పేరు నేను తీయ‌లేదు. ఆయ‌న నా క‌న్న పెద్దవాళ్లు . వాళ్ల ముందు నేను పుట్టి పెరిగాను. వారిని ఎందుకు అంటాను. ఎవ‌రి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.

మేం ఎప్పుడు క‌లిసే అవ‌కాశం రాలేదు. క‌లిస్తే త‌ప్ప‌కుండా మాట్లాడ‌తాను. మామధ్య గొడవలు అని అంద‌రు అంటారు . వాటిని ప‌ట్టించుకునే టైం ఉండ‌దు. ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీగా ఉన్నాం అని విష్ణు చెప్పుకొచ్చారు. మొత్తానికి స్నేక్ బాబు అంటూ మంచు విష్ణు మ‌రోసారి నాగ‌బాబుపై త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.