వరంగల్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటన.. కోర్టుల పరిశీలన
తనతో పాటు నోబుల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి విధాత, వరంగల్: రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆదివారం వరంగల్‌లో పర్యటించారు. హై కోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, నోబుల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్ధి పర్యటించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని జిల్లా కోర్టు పరిధిలో ఉన్న వివిధ కోర్టులను సందర్శించారు. వరంగల్ వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పోలీసులు ఎన్ఐటిలో గౌరవందనం చేసి స్వాగతం పలికారు. […]

- తనతో పాటు నోబుల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి
విధాత, వరంగల్: రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆదివారం వరంగల్‌లో పర్యటించారు. హై కోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, నోబుల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్ధి పర్యటించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని జిల్లా కోర్టు పరిధిలో ఉన్న వివిధ కోర్టులను సందర్శించారు.
వరంగల్ వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పోలీసులు ఎన్ఐటిలో గౌరవందనం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పూలబొకే అందించి ఆహ్వానం తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో జడ్జి, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు.
వరంగల్ కోర్టు ఆవరణలో ఆధునికరించిన పోక్సో కోర్టు, ఫ్రెండ్లీ కోర్టును హై కోర్ట్ చీఫ్ జస్టిస్ పరిశీలించారు. అనంతరం జ్యుడీషియరీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు.
కార్యక్రమంలో వేదికపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ వరంగల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ గోపీ, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు, జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.