BRSకు VRS ఇవ్వాలి: ‘బండి’ యాత్ర ముగింపు సభలో JP నడ్డా
బండి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో నడ్డా కుటుంబ పాలన, అవినీతి, అక్రమాల పాలనకు చరమగీతం పాడాలి.. వెల్‌నెస్ సెంటర్లకు కేంద్రం నిధులు ఇస్తే.. బస్తీ దవాఖానలుగా మార్చిన కేసీఆర్ విధాత: కరీంనగర్ ఎస్ఆర్ ఆర్ కళాశాల మైదానంలో జరిగిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బండి […]

- బండి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో నడ్డా
- కుటుంబ పాలన, అవినీతి, అక్రమాల పాలనకు చరమగీతం పాడాలి..
- వెల్‌నెస్ సెంటర్లకు కేంద్రం నిధులు ఇస్తే.. బస్తీ దవాఖానలుగా మార్చిన కేసీఆర్
విధాత: కరీంనగర్ ఎస్ఆర్ ఆర్ కళాశాల మైదానంలో జరిగిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్‌కు వీఆర్ఎస్ ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర దీంతో ముగిసేది కాదనీ, రాబోయే కాలంలో ఇంటింటికీ, గడప గడపకూ బండి సంజయ్ ద్వారా బీజేపీ చేరుతుందని అన్నారు. అబద్ధాలు, అవినీతి, అక్రమాలకు నిలయమైన టీఆర్ఎస్‌ను ఓడించి బీజేపీని గెలిపించాలని కోరారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ పదవులన్నీ తన కుటుంబానికే అప్పజెప్పి దిళితులను వంచించాడని దుయ్యబట్టారు. కానీ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నినాదంతో బీజేపీ అందరి సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని నడ్డా స్పష్టం చేశారు.
BJP National President Shri @JPNadda addresses public meeting in Karimnagar, Telangana. #PrajaSangramaYatra5 https://t.co/z6zHBAdvpj
— BJP (@BJP4India) December 15, 2022
ఒక ఆదివాసీ భారత రాష్ట్రపతి అవుతారని ఎవరైనా ఊహించారా, ఒక దళితుడు రాష్ట్రపతి అవుతారని కలగన్నారా.. బీజేపీ ఆ ఊహలను, కలలను నిజం చేసింది. బీజేపీ సబ్‌కా సాత్, వికాస్ ధ్యేయంగా పనిచేస్తున్నదని మరోసారి తెలియజేశారు.
కేంద్రం ఇచ్చిన నిధులను, పథకాలను కేసీఆర్ తనవిగా చెప్పుకొంటూ ప్రచారం చేసుకొంటున్నాడని నడ్డా ఆరోపించారు. ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిధులు ఇస్తే.., వాటిని బస్తీ దవాఖానలుగా మార్చి కేసీఆర్ తనవిగా చెప్పుకొంటున్నాడని విమర్శించారు.
ముగింపు సభకు మధ్యాహ్నమే రావలసి ఉన్న జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తటంతో సుమారు ఐదు గంటలు ఆలస్యమైంది. అయినా జిల్లావ్యాప్తంగా భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలు ఓపికతో జేపీ నడ్డా రాకకోసం ఎదురు చూసి ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నవంబర్ 28న ప్రారంభమై ఐదు జిల్లాలు, మూడు పార్లమెంట్ నియోజక వర్గాలు, 8 ఎమ్మెల్యే నియోజక వర్గాల గుండా కొనసాగి కరీంనగర్ సభతో ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది.