Kodanda Ram | ఎవరితోనైనా.. కలసి పని చేస్తాం: ప్రో. కోదండ రామ్
Kodanda Ram | విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, ఈ పాలనను అంతమొందించేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తామని TJS పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రో.కోదండ రామ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు అంశాల విషయంలో నిరంతరం పోరాడామని టీజే ఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో టీజే ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ […]

Kodanda Ram |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, ఈ పాలనను అంతమొందించేందుకు ఎవరితోనైనా కలసి పనిచేస్తామని TJS పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రో.కోదండ రామ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు అంశాల విషయంలో నిరంతరం పోరాడామని టీజే ఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో టీజే ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల సమస్యలను చెప్పేందుకు గాను ఎవరైనా తెలంగాణ జన సమితి కార్యాలయానికి రావచ్చని ఇది సమస్యలున్న వారి కోసం పోరాడే అడ్డాగా ఉంటుందన్నారు.
జూన్ రెండో తేదీ నుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిపే కార్యక్రమాల విషయమై ప్రజల వద్దకు వచ్చే నాయకులను మంత్రులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల విషయంలో మొహం చాటేసిన నాయకులను నిలదీయాలని అన్నారు.
ఏ ఆకాంక్షల కోసం ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు
దశాబ్ది ఉత్సవాలను తమ గొప్పతనాన్ని చెప్పుకునేందుకు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీజేఎస్ పోటీ చేసేందుకు కీలకంగా ఎంచుకున్న నియోజకవర్గాల్లో ఒకటైన జహీరాబాద్ లో మొగుడంపల్లి ఆశప్పను అభ్యర్థిగా ప్రకటిస్తున్నామన్నారు.
పొత్తుల విషయమై మాట్లాడుతూ నియంత పాలన అంతమొందించేందుకు ఎవరు కలిసి వచ్చిన కలిసేందుకు సిద్ధమన్నారు.