ఇప్పుడు.. బీజేపీలోకి వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమిటి?

ఉన్నమాట: దుబ్బాక, హుజురాబాద్‌ ఫలితాలు చూస్తే అభ్యర్థులే ముందున్నారు. బీజేపీని వాళ్లే ప్రజల్లోకి తీసుకెళ్లారు. మునుగోడు తుది ఫలితం రాలేదు. కానీ ఇక్కడ కూడా బీజేపీ లేదు, అభ్యర్థినే ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి బండి సంజయ్‌ లాంటి నేతలు చెప్పుకుంటున్నట్టు రాష్ట్రంలో ఆ పార్టీ బలం ఎంత అన్నది తేలిపోయింది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొస్తే తప్పా వాళ్ల పార్టీలో ఉన్న వాళ్లలో చాలా మంది ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు కాదని […]

  • By: krs    latest    Nov 06, 2022 10:25 AM IST
ఇప్పుడు.. బీజేపీలోకి వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమిటి?

ఉన్నమాట: దుబ్బాక, హుజురాబాద్‌ ఫలితాలు చూస్తే అభ్యర్థులే ముందున్నారు. బీజేపీని వాళ్లే ప్రజల్లోకి తీసుకెళ్లారు. మునుగోడు తుది ఫలితం రాలేదు. కానీ ఇక్కడ కూడా బీజేపీ లేదు, అభ్యర్థినే ఆ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి బండి సంజయ్‌ లాంటి నేతలు చెప్పుకుంటున్నట్టు రాష్ట్రంలో ఆ పార్టీ బలం ఎంత అన్నది తేలిపోయింది. ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొస్తే తప్పా వాళ్ల పార్టీలో ఉన్న వాళ్లలో చాలా మంది ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు కాదని అర్థం కావాలి.

అలాగే బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీ నేతలతో కేసీఆర్‌ను తిట్టనంత మాత్రానా ప్రజల ఆదరణ ఉండదు అని అవగతం కావాలి. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. అంతేగాని భావోద్వేగాలు రెచ్చగొట్టి, మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే అన్నిసార్లు అది సాధ్యం కాదని మరోసారి రుజువు అయ్యింది.

CM KCR ఇన్‌చార్జి గ్రామంలో టీఆర్ఎస్‌కు మెజార్టీ

అలాగే మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత టీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని అన్న నేతలు ప్రస్తుతం ఆ పార్టీలో చేరిన వాళ్లను సార్వత్రిక ఎన్నికల వరకైనా నిలబెట్టుకోగలరా? అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీలో చేరి ఇటీవల బైటికి వచ్చిన నేతల వ్యాఖ్యలు చూస్తే వాళ్లు ఏ ఉద్దేశంతో బీజేపీలో చేరుతున్నారో దానికి భిన్నమైన ఆ పరిస్థితులు ఆపార్టీలో ఉన్నాయని వాళ్లు చెప్పారు. రాజకీయాల్లో రాణించాలంటే కొంత సంమయనం కావాలి. క్షణికావేశంలో తీసుకునే కొన్ని రాజకీయ నిర్ణయాలు వాళ్ల రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉన్నది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ విషయంలో ఇది స్పష్టమౌతున్నది.

ఈటల, కోమటిరెడ్డితోనే ఎన్నికలు ధనమయం: కేటీఆర్ ఫైర్

ఎందుకంటే పార్టీని వీడి తన సొంత ఇమేజ్‌తో గెలిచిన ఈటల రాజేందర్‌ లాంటి వాళ్లకే ఆ పార్టీలో ప్రాధాన్యం ఏపాటిదో అర్థమౌతున్నది. ఆయనకు రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించలేదు, కేంద్ర స్థాయిలోనూ ఆయనకు తగిన పార్టీ పదవి ఇవ్వలేదు. ఎక్కడా లేని విధంగా చేరికల కమిటీ అని పెట్టి దానికి ఆయన ఛైర్మన్‌గా చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి వలసలు ప్రోత్సహించాలని ఈ బాధ్యత ఆయన భుజాలపై పెట్టి ఉంటారు.

కానీ సీటు ఆశించో, పదవి దక్కలేదనో లాంటి కారణాలతో అధికార పార్టీని వీడి బీజేపీలో చేరిన వారికి అక్కడ కూడా నిరాశే మిగులుతున్నది. కండువా కప్పుకున్న రోజు తప్పా మళ్లీ పెద్దగా ఎక్కడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. అందుకే దాసోజు, స్వామిగౌడ్‌, బూడిద భిక్షమయ్య గౌడ్‌ లాంటి వాళ్లు తిరిగి గులాబీ గూటికి చేరారు. మునుగోడు ఫలితం తర్వాత రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ వెళ్లే వారి కంటే ఏదో ఒక కారణంతో బీజేపీలోకి వెళ్లిన వాళ్లే టీఆర్‌ఎస్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటున్నారు. -ఆసరి రాజు

12కు 12తో.. గులాబీ వనమైన ఉమ్మడి నల్లగొండ

పైనున్నోడు ఫేకుడు.. కిందున్నోడు జోకుడు: BJPపై కేటీఆర్ నిప్పులు