మోడీ, రాహుల్‌లలో ఎవరు పప్పు?
ఉన్నమాట: నరేంద్రమోడీ ఏమి చదివారో ఎక్కడ చదివారో రహస్యం. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ, గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ చదివారని చాలా వివాదం తర్వాత ప్రకటించారు. అవి కూడా ఎక్సటర్నల్ అట.ఏ సబ్జెక్టు, ఏ సంవత్సరం అన్నది తెలియదు. ఆయనవి ఎక్కువగా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలే. అందులో అన్నీ తప్పులే ఉంటాయి. చరిత్ర గురించి ఆయన ఇప్పటికి ఒక డజను సార్లు తప్పులు మాట్లాడినట్టు రికార్డులు ఉన్నాయి. ప్రపంచం గురించి మోడీ అవగాహన సందేహాస్పదం. సామాజిక దృక్పథం కంటే […]

ఉన్నమాట: నరేంద్రమోడీ ఏమి చదివారో ఎక్కడ చదివారో రహస్యం. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ, గుజరాత్ యూనివర్సిటీలో ఎంఏ చదివారని చాలా వివాదం తర్వాత ప్రకటించారు. అవి కూడా ఎక్సటర్నల్ అట.
ఏ సబ్జెక్టు, ఏ సంవత్సరం అన్నది తెలియదు. ఆయనవి ఎక్కువగా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలే. అందులో అన్నీ తప్పులే ఉంటాయి.
చరిత్ర గురించి ఆయన ఇప్పటికి ఒక డజను సార్లు తప్పులు మాట్లాడినట్టు రికార్డులు ఉన్నాయి. ప్రపంచం గురించి మోడీ అవగాహన సందేహాస్పదం. సామాజిక దృక్పథం కంటే వ్యాపార దృక్పథం మిన్న. రిచ్ అండ్ ఫేమస్ అంటే మక్కువ. ప్రజాస్వామిక భావనలపై ఏమాత్రం గౌరవం లేని నేత.
దేశంకోసం ఎటువంటి త్యాగాలు చేయని రాజకీయ నేపథ్యం. విద్వేష ప్రచారం ఆయన శైలి. గత పాలకులను అదే పనిగా తిట్టి తనను తాను గొప్పగా ప్రకటించుకునే సంకుచిత బుద్ధి. ప్రజల కోసం ఒక్క విధాన నిర్ణయమూ చేయని ప్రభుత్వాధినేతగా పేరు.
రాహుల్‌గాంధీ కొలంబా స్కూల్, డూన్ స్కూల్, స్టీఫెన్స్ కాలేజీ, హార్వర్డ్ యూనివర్సిటీ, రోలిన్స్ కాలేజీ, ట్రినిటీ కాలేజీ, కేంబ్రిడ్జిలలో చదివారు. ఆయన ఆఖరుగా చేసింది ఎంఫిల్. నానమ్మ ఇందిరాగాంధీ హత్య, తండ్రి రాజీవ్‌గాంధీ హత్యల వల్ల భద్రతా కారణాల రీత్యా రాహుల్ యూనివర్సిటీలు, దేశాలు మారవలసి వచ్చింది.
దేశం గురించి, ప్రపంచం గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న నాయకుడు. ప్రజా కేంద్రక ఆలోచనలు ఉన్న నాయకుడు. త్యాగాలు చేసిన కుటుంబ వారసత్వం. నిర్మాణాత్మక విమర్శ, ప్రచారం ఆయన బలం. ప్రజలకోసం అనేక పథకాలు, విధాన నిర్ణయాలు చేసి దేశంలో పేదరిక నిర్మూలనకోసం పాటుబడిన చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిది. ఇప్పుడు చెప్పండి రాహుల్ పప్పా? మోడీ పప్పా?.