నిర్ణయాత్మక మ్యాచ్‌లో నెగ్గేది ఎవరు?
విధాత, క్రికెట్: టీ-20 మ్యాచ్‌లో భారీగా స్కోర్ చేసినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత్ తర్వాత జరిగిన మ్యాచ్‌లో బదులు తీర్చుకున్నది. ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌ను గెలిచి సీరిస్ దక్కించుకోవాలని రోహిత్ సేన ఆరాట పడుతున్నది. బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ సాధిస్తున్నా.. బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం తలనొప్పిగా మారింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగులు చేసినా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, ఫిల్డింగ్ లోపాలను ఎత్తిచూపింది. అక్షర్ పటేల్ ఒక్కడే […]

విధాత, క్రికెట్: టీ-20 మ్యాచ్‌లో భారీగా స్కోర్ చేసినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత్ తర్వాత జరిగిన మ్యాచ్‌లో బదులు తీర్చుకున్నది. ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్‌ను గెలిచి సీరిస్ దక్కించుకోవాలని రోహిత్ సేన ఆరాట పడుతున్నది. బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ సాధిస్తున్నా.. బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం తలనొప్పిగా మారింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగులు చేసినా ఓటమి పాలైంది.
ఈ మ్యాచ్‌లో బౌలింగ్, ఫిల్డింగ్ లోపాలను ఎత్తిచూపింది. అక్షర్ పటేల్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడం రోహిత్ సేనకు సానుకూలంగా ఉన్నది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. ఫలితంగా రెండో మ్యాచ్‌లో చోటు కోల్పోయాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ హర్షద్ పటేల్, స్పిన్నర్ చాహల్ ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నారు.
ఈ సిరీస్‌లో ఆరు ఓవర్లకు 81 పరుగులు ఇచ్చి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ హర్షద్ పటేల్ నిలిచాడు. బూమ్రా అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. బ్యాటింగ్‌లో రోహిత్, కోహ్లీ రాణించాలని.. చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్, దినేశ్ కార్తిక్ మెరుపులు మెరిపిస్తే భారత గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని జట్టు యాజమాన్యం భావిస్తున్నది. ఉప్పల్ స్టేడియంలో మూడో టీ-20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నది.