ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టానికి రాష్ట్రం ఎందుకు బాధ్య‌త వ‌హించ‌దు: సుప్రీంకోర్టు

విధాత: ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టానికి రాష్ట్రం ఎందుకు బాధ్య‌త వ‌హించ‌ద‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన న‌ష్టంపై సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. లాయ‌ర్ల‌కు ఫీజు చెల్లింపులో ఉన్న శ్ర‌ద్ధ ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌పై క‌నిపించ‌డం లేద‌ని పేర్కొన్న‌ది. ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని ప్ర‌భుత్వం ఎందుకు భ‌రించ‌ద‌ని సుప్రీంకోర్టు నిల‌దీసింది. జ‌రిగిన న‌ష్టంపై ఎన్జీటీ ప్రిన్పిప‌ల్ బెంచ్‌ రూ. 120 కోట్ల జ‌రిమానా విధించింది. ఎన్జీటీ బెంచ్ తీర్పును ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో స‌వాల్ చేసింది. విచార‌ణ‌లో జ‌స్టిస్ ర‌స్తోగి, […]

  • By: krs    latest    Sep 26, 2022 2:17 PM IST
ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టానికి రాష్ట్రం ఎందుకు బాధ్య‌త వ‌హించ‌దు: సుప్రీంకోర్టు

విధాత: ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టానికి రాష్ట్రం ఎందుకు బాధ్య‌త వ‌హించ‌ద‌ని, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రిగిన న‌ష్టంపై సుప్రీంకోర్టు ఏపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. లాయ‌ర్ల‌కు ఫీజు చెల్లింపులో ఉన్న శ్ర‌ద్ధ ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌పై క‌నిపించ‌డం లేద‌ని పేర్కొన్న‌ది.

ప‌ర్యావ‌ర‌ణ న‌ష్టాన్ని ప్ర‌భుత్వం ఎందుకు భ‌రించ‌ద‌ని సుప్రీంకోర్టు నిల‌దీసింది. జ‌రిగిన న‌ష్టంపై ఎన్జీటీ ప్రిన్పిప‌ల్ బెంచ్‌ రూ. 120 కోట్ల జ‌రిమానా విధించింది. ఎన్జీటీ బెంచ్ తీర్పును ఏపీ ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో స‌వాల్ చేసింది.

విచార‌ణ‌లో జ‌స్టిస్ ర‌స్తోగి, జ‌స్టిస్ ర‌వికుమార్ ధ‌ర్మాసనం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. కేసులో లాయ‌ర్ల‌కు ఎంత చెల్లించారో తెలుసుకునేందుకు నోటీసు ఇస్తామ‌న్నది. ఒక్క కేసుకు ఎంద‌రు సీనియ‌ర్ లాయ‌ర్ల‌ను ఎంగేజ్ చేస్తార‌ని కోర్టు ప్ర‌శ్నించింది.

ఎన్జీటీ తీర్పుల‌పై దాఖ‌లైన అన్ని అప్పీళ్ల‌ను ఒకేసారి విచారిస్తామ‌ని కోర్టు తెలిపింది. పోల‌వ‌రం, పురుషోత్త‌ ప‌ట్నం, పులిచింత‌ల‌పై ఇచ్చిన తీర్పుల‌పై విచారిస్తామ‌న్న‌ది.