Ind vs WI: జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన విండీస్.. ఫ‌లితం తేలేలా క‌నిపించ‌డం లేదే..!

Ind vs WI:  వెస్టిండీస్ టూర్‌లో భాగంగా భార‌త్ ఇప్పుడు రెండో టెస్ట్ ఆడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌటైంది. భార‌త్ బ్యాట్స్‌మెన్స్ లో విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్ర‌మంలో భార‌త్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ […]

  • By: sn    latest    Jul 23, 2023 1:36 AM IST
Ind vs WI: జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన విండీస్.. ఫ‌లితం తేలేలా క‌నిపించ‌డం లేదే..!

Ind vs WI: వెస్టిండీస్ టూర్‌లో భాగంగా భార‌త్ ఇప్పుడు రెండో టెస్ట్ ఆడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆలౌటైంది. భార‌త్ బ్యాట్స్‌మెన్స్ లో విరాట్ కోహ్లీ(206 బంతుల్లో 11 ఫోర్లతో 121) శతక్కొట్టగా.. రోహిత్ శర్మ(80), యశస్వీ జైస్వాల్(57), రవీంద్ర జడేజా(61), రవిచంద్రన్ అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్ర‌మంలో భార‌త్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. ఇక తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్ జిడ్డు బ్యాటింగ్ చేస్తున్నారు. భార‌త బౌల‌ర్లు అద్భుత‌మైన బాల్స్ సంధిస్తున్నా కూడా వికెట్స్ ద‌క్క‌డం లేదు. బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై విండీస్ బ్యాట్స్‌మెన్స్ ఓపిగ్గా ఆడుతూ భారత బౌలర్ల స‌హనాన్ని ప‌రీక్షిస్తున్నారు…

ఓవర్‌నైట్ స్కోర్ 86/1 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన వెస్టిండీస్ మూడో రోజు ఆట పూర్త‌య్యే స‌రికి ఐదు వికెట్స్ కోల్పోయి 229 ప‌రుగుల చేశారు. రెండో రోజు 33 పరుగులు చేసిన చంద్రపాల్‌ని తొలి వికెట్‌గా రవీంద్ర జడేజా ఔట్ చేయ‌గా, ముకేశ్ కుమార్‌కి రెండో వికెట్ దక్కింది. శార్ధూల్ స్థానంలో వ‌చ్చిన ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి
కిర్క్ మెక్‌కెంజీ( 57 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు) అవుట్ అయ్యాడు. ఇక ఇది అత‌ని తొలి అంతర్జాతీయ వికెట్ కావ‌డం విశేషం. ఇక ముకేశ్ కుమార్ వికెట్ తీసిన కొద్ది సేప‌టికి వర్షం కురవడంతో మ్యాచ్‌కి కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఇక వర్షం తగ్గిన తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనా కూడా భారత బౌలర్లకు పిచ్ ఏ మాత్రం స‌హ‌క‌రించ‌లేదు.

అయితే అశ్విన్ వేసిన ఓ అద్భుతమైన బంతికి విండీస్ కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ (235 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు) చేసి ఔట‌య్యాడు. దీంతో 157 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. అయితే జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అతరనే చాలా సేప‌పు భారత బౌలర్లకు వికెట్ దక్కకుండా చేశారు. కాని జ‌డేజా బౌలింగ్‌లో ర‌హానే అద్భుతమైన క్యాచ్ ప‌ట్ట‌డంతో బ్లాక్ వుడ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వ‌త వ‌చ్చిన జాషువా డసిల్వా కూడా సిరాజ్ వేసిన అద్భుత‌మైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్ర‌స్తుతం క్రీజులో అలిక్ అతరనే (111బంతుల్లో 3 ఫోర్లతో 37), జాసన్ హోల్డ‌ర్ ( 39 బంతుల్లో 11 ప‌రుగులు, ఒక ఫోర్‌) క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరుకి వెస్టిండీస్ 209పరుగులు వెనకబడి ఉన్నా, మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండ‌డంతో గేమ్ డ్రా దిశ‌గా సాగుతున్న‌ట్టు తెలుస్తంది. వ‌రుణుడు కూడా మధ్య‌మ‌ధ్య‌లో డిస్ట్ర‌బ్ చేస్తుండ‌డంతో రిజ‌ల్ట్ వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు.