హైదరాబాద్‌లో వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం.. నగ్న చిత్రాలతో బెదిరింపులు
Hyderabad | ఓ కానిస్టేబుల్ కామంతో చెలరేగిపోయాడు. పొరుగింట్లో ఉన్న ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె తిరస్కరించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక బాధిత మహిళపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఏకంగా ఆమె ఇంటికెళ్లి, బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. నగ్న చిత్రాలు సేకరించాడు. ఇంకేముంది ఆ వీడియోలను, నగ్న చిత్రాలను అడ్డుపెట్టుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. గతంలో పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే నగ్న చిత్రాలను బయట […]

Hyderabad | ఓ కానిస్టేబుల్ కామంతో చెలరేగిపోయాడు. పొరుగింట్లో ఉన్న ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె తిరస్కరించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక బాధిత మహిళపై మరింత కక్ష పెంచుకున్నాడు. ఏకంగా ఆమె ఇంటికెళ్లి, బెదిరింపులకు పాల్పడి అత్యాచారం చేశాడు. నగ్న చిత్రాలు సేకరించాడు. ఇంకేముంది ఆ వీడియోలను, నగ్న చిత్రాలను అడ్డుపెట్టుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. గతంలో పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని, లేదంటే నగ్న చిత్రాలను బయట పెడుతానని బెదిరిస్తున్నాడు. అతని ఆగడాలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన పి వెంకటేశ్వర్లు(30) అనే యువకుడు గతంలో మాదన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవాడు. సైదాబాద్‌లో తన భార్యతో కలిసి ఉండేవాడు. అయితే తన భార్యతో మాట్లాడే పొరుగింటి మహిళపై వెంకటేశ్వర్లు కన్నేశాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో 2021, జనవరిలో సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లకు పోలీసు ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించేశారు. అయినప్పటికీ కానిస్టేబుల్ ఆగడాలు ఆగలేదు. లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. చేసేదేమీ లేక 2021, మే నెలలో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈసారి పోలీసులు కేసు నమోదు చేసి కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు తరలించారు. కొద్ది కాలం పాటు జైల్లో ఉండి విడుదలయ్యాడు.
బాధిత మహిళ సైదాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు తన మకాం మార్చింది. సికింద్రాబాద్ నుంచి మీర్‌పేటకు ఇటీవలే మారింది. ఈ విషయాన్ని కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు పసిగట్టాడు. ఇక ఈ ఏడాది ఆగస్టు 18న మీర్‌పేటలో ఉంటున్న బాధితురాలి ఇంటికి వెళ్లాడు కానిస్టేబుల్. ఆమెపై అత్యాచారం చేస్తూ.. వీడియోలను చిత్రీకరించాడు. నగ్న చిత్రాలు తీశాడు. వాటిని అడ్డుపెట్టుకొని అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఈ వీడియోలను బయట పెడుతానని బెదిరించాడు.
ఈ నెల 14న మళ్లీ ఆమె ఇంటికి వెళ్లాడు. అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అంతే కాకుండా గతంలో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలని, లేదంటే నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. దీంతో కానిస్టేబుల్ అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మళ్లీ వెంకటేశ్వర్లును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.