మూత్రంతో కంటి చూపు మెరుగైంద‌ట‌..! ఓ టిక్‌టాక‌ర్ వెల్ల‌డి

కంటి చూపుతో బాధ‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. వారంతా కంటి డాక్ట‌ర్‌(ఆప్తామాల‌జిస్ట్)ను సంప్ర‌దిస్తారు. వైద్యులు సూచ‌న‌లు, స‌ల‌హా మేర‌కు ఐ డ్రాప్స్‌ను ఉప‌యోగించి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు

మూత్రంతో కంటి చూపు మెరుగైంద‌ట‌..! ఓ టిక్‌టాక‌ర్ వెల్ల‌డి

విధాత: కంటి చూపుతో బాధ‌ప‌డే వారు చాలా మందే ఉంటారు. వారంతా కంటి డాక్ట‌ర్‌(ఆప్తామాల‌జిస్ట్)ను సంప్ర‌దిస్తారు. వైద్యులు సూచ‌న‌లు, స‌ల‌హా మేర‌కు ఐ డ్రాప్స్‌ను ఉప‌యోగించి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కానీ ఓ మ‌హిళ మాత్రం ఐ డ్రాప్స్‌న‌కు బ‌దులుగా మూత్రాన్ని కంటి చుక్క‌లుగా ఉప‌యోగించింది. ప్ర‌స్తుతం ఈవిడ క‌థ నెట్టింట వైర‌ల్ అవుతోంది.


వివ‌రాల్లోకి వెళ్తే.. స్పానిష్‌కు చెందిన ఓ టిక్‌టాక‌ర్ సుమ ఫ్రేల్.. కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆమెకు పూర్తిగా కంటి చూపు త‌గ్గింది. అంతేకాకుండా మ‌యోపియాతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో ఆమె ఆప్తామాల‌జిస్ట్‌ను సంప్ర‌దించ‌లేదు. త‌న మూత్రాన్ని కంటి చుక్క‌లుగా ఉప‌యోగించింది. ఆ త‌ర్వాత త‌న కంటి చూపు మెరుగుప‌డింద‌ని తెలిపారు సుమ‌.


యూరిన్ థెర‌పీకి మ‌ద్ద‌తు


మూత్రాన్ని కంటి చుక్క‌లుగా ఉప‌యోగించిన త‌ర్వాత ఊహించ‌నంత‌గా త‌న కంటి చూపు మెరుగుప‌డింద‌ని సుమ పేర్కొన్నారు. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటీష్ ప్రకృతి వైద్యుడు జాన్ డబ్ల్యూ. ఆర్మ్‌స్ట్రాంగ్ ద్వారా ప్రాచుర్యం పొందిన ‘యూరిన్ థెరపీ’కి ఆమె మద్దతు ఇచ్చారు. ఐ డ్రాప్స్‌గా మూత్రాన్ని వాడిన త‌ర్వాత మ‌యోపియా కూడా మాయ‌మైంద‌న్నారు. ఈ విష‌యాల‌న్నీంటిని ఆమె టిక్‌టాక్‌లో వెల్ల‌డించారు.


అయితే, ఫ్రేల్ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ప్ప‌టికీ.. ఇది నిజంగా ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రీయ అధ్యయనం లేదు. కాబట్టి, ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతిదాన్ని నమ్మకూడదు. అలాంటి ప్ర‌య‌త్నం కూడా చేయొద్దు.