Drunken Womens: మద్యం కిక్కులో మగువలు.. మగవారికే షాక్‌లు

విధాత, వెబ్ డెస్క్ : అధునిక జీవనశైలీ (Modern Days)లో పురుషులే కాదు..మహిళలు కూడా మద్యం సేవించి (Drinking Alcohol) చిందులేయడం సాదారణంగా మారింది. అయితే పబ్ లు..బార్ లలో ఫుల్లుగా మందు తాగేసి రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడంలో కూడా మగువలు మగవారికి సమాన స్థాయి ప్రదర్శిస్తున్నారు.
మద్యం మత్తులో యువతులు (Young womens) కారుతో బీభత్సం సృష్టించిన ఘటన హైదరాబాద్ (Hyderabad)కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద కలకలం రేపింది. తాగిన మత్తులో కారు నడిపి ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టారు. దీనిపై ప్రశ్నించిన బాధితుడినే బెదిరించారు. దీంతో అతను ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించగా వారు రంగప్రవేశం చేసి కారును ఆపి యువతులను విచారించారు.
వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై మద్యం మత్తులో యువతులు సాగించిన వీరంగం..వాగ్వివాదం..కారులో మద్యం బాటిళ్లను చూసి ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు ఇదేం కాలంరా.. సామీ అనుకున్నారు.