‘మన ఊరు మనబడి’ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ శరత్

విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: మ‌న ఊరు మనబడి కింద చేపట్టిన పనులను వేగవంతం గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు- మనబడి పనుల పురోగతి పై అదనపు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా విధానం మెరుగు పరచడంతో పాటు మన ఊరు […]

‘మన ఊరు మనబడి’ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్ శరత్

విధాత, బ్యూరో మెదక్ ఉమ్మడి జిల్లా: మ‌న ఊరు మనబడి కింద చేపట్టిన పనులను వేగవంతం గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మన ఊరు- మనబడి పనుల పురోగతి పై అదనపు కలెక్టర్ రాజర్షి షా తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా విధానం మెరుగు పరచడంతో పాటు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా, అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేసి ఆయా పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు.

అన్ని పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అలాగే ఇంజినీరింగ్ అధికారులు బిల్లులను ఎఫ్.టి.ఓ. లో నమోదు చేయాలని సూచించారు. పనుల పురోగతిలో వెనకబడిన పాఠశాలల్లో రాత్రింబవళ్లు పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల నాణ్యతలో అధికారుల నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు.

ఆయా ఇంజినీరింగ్ ఏజెన్సీ లతో కోఆర్డినేషన్ చేసుకొని ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయించాలని విద్యాశాఖ అధికారికి సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాధికారి, నాంపల్లి రాజేష్, జ‌డ్పీసీఈవో ఎల్లయ్య, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, తదితర ఇంజినీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: క‌లెక్ట‌ర్
జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అవసరమైన చేయూతనివ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ రాజర్షి తో కలిసి దళిత బంధు లబ్ధిదారుల యూనిట్ల అభివృద్ధిపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో క‌లిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ నియోజకవర్గం వారీగా యూనిట్ వారీగా ఆయా లబ్ధిదారుల ఆర్థిక అభివృద్ధి, ఇంకా ఏదైనా సపోర్ట్ అవసరం ఉందా, లబ్ధిదారులు తమ యూనిట్ సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, ఎంత ఆదాయం వస్తుంది, తదితర విషయాలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు దళిత బంధు పొందక ముందు ఉన్న స్థితి గతులు, పొందిన తర్వాత స్థితిగతులను ఆయా నియోజక వర్గ ప్రతేకాధికారులు పర్యవేక్షించాల‌న్నారు.

అనంత‌రం వారికి కావాల్సిన సపోర్ట్ ఏంటి అన్నది పరిశీలించి, ఆ మేరకు చేయూతను అందించాలని ఆదేశించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని, వారు అభివృద్ధి చెందేలా దృష్టి సారించాలన్నారు. లబ్ధిదారుడు దళిత బంధులో ఎంచుకున్న యూనిట్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఉన్నతంగా ఎదిగేందుకు వారికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు రావు, దళిత బంధు నియోజక వర్గం ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.