ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి: రిసోర్స్ పర్సన్ టీ.ఎన్.స్వామి
విధాత, మెదక్ బ్యూరో: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని hiv ఎయిడ్స్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ టి. ఎన్.స్వామి అన్నారు. మంగళవారం నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ఆధ్వర్యంలో మెదక్ లోని స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు […]

విధాత, మెదక్ బ్యూరో: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయమని, 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని hiv ఎయిడ్స్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ టి. ఎన్.స్వామి అన్నారు. మంగళవారం నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం ఆధ్వర్యంలో మెదక్ లోని స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ రిసోర్స్ పర్సన్ స్వామి మాట్లాడుతూ ఎయిడ్స్‌కు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం, నివారించడం, పరిష్కరించడంలో ఎయిడ్స్ విద్య యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా గుర్తించబడినదని అన్నారు. ఎయిడ్స్ విద్యను వ్యాప్తి చేయడానికి ముఖ్యమైన కారణం కళంకం, వివక్షను తగ్గించడమని అన్నారు.
HIV పాజిటివ్ వ్యక్తులు ఇళ్లను వదిలి వెళ్ళవలసి వస్తుందని, సానుకూల వ్యక్తుల పట్ల వివక్ష చూపడం వల్ల AIDS మహమ్మారి వ్యాప్తి చెందడానికి అవకాశంఉంటుందని అన్నారు. HIV కోసం పరీక్షించబడతారేమోనని భయపడితే, ఆపై వారు తెలియకుండానే మరొకరికి సంక్రమిచే అవకాశముందని అందువల్ల హెచ్‌ఐవి/ఎయిడ్స్ ఉన్న వారు తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవాలన్నారు.
ఎయిడ్స్ పైన అవగాహన విద్య అనేది హై రిస్క్ గ్రూప్లకు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకోని అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తమ తమ గ్రామాలలో ఎయిడ్స్ పై అవగాహన కల్పించాలని స్వామి కోరారు. గ్రామీణ యువత వీటి పైన అవగాహన, నివారణ, నిర్మూలన విషయాలు తెలుసుకోవాలని, ఈ మహమ్మారిని తరిమి కొట్టడం అందరి బాధ్యత అని ఆయన అన్నారు.
కార్యక్రమంలో నెహ్రు యువ కేంద్ర ఉమ్మడి మెదక్ జిల్లా అధికారి రంజిత్ రెడ్డి, నెహ్రు యువ కేంద్ర ఉమ్మడి మెదక్ జిల్లా కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ అధికారి డాక్టర్ నవీన్, ictc కౌన్సిలర్లు గోపి, రాజేశ్వర్ డిగ్రీ కళాశాల అంజయ్య, జి రాజు యువజన శాఖ కార్యాలయ సిబ్బంది, యూత్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు భూషణ్, యువజన సంఘ ప్రతినిధులు బాయికాడి లక్ష్మణ్, వాలంటరీలు రవి, అజయ్, సాయి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు