Vijayasai Reddy | మీరే మళ్ళీ రావాలి.. విజయసాయికి జగన్ ఆదేశం

Vijayasai Reddy విధాత‌: నిన్న మొన్నటి వరకూ అటు రాజకీయాల్లోను, సోషల్ మీడియాలో కూడా అత్యంత యాక్టివ్ గా ఉంటూ అటు టిడిపి, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తనదైన స్థాయిల్లో పంచులతో ఆడుకునే వైసిపి జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఈమధ్య కాస్త వెనుకబడ్డారు.. ఆయనే వెనుకబడ్డారో. ఆయన్ను ఎవరైనా వెనక్కు నెట్టారో తెలియదు కానీ ఎక్కడా కనిపించడం లేదు. మొన్నటివరకూ విశాఖను తన కార్యక్షేత్రంగా చేసుకుని ధూమ్ ధామ్ చేసిన విజయసాయి రెడ్డి […]

Vijayasai Reddy | మీరే మళ్ళీ రావాలి.. విజయసాయికి జగన్ ఆదేశం

Vijayasai Reddy

విధాత‌: నిన్న మొన్నటి వరకూ అటు రాజకీయాల్లోను, సోషల్ మీడియాలో కూడా అత్యంత యాక్టివ్ గా ఉంటూ అటు టిడిపి, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తనదైన స్థాయిల్లో పంచులతో ఆడుకునే వైసిపి జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఈమధ్య కాస్త వెనుకబడ్డారు.. ఆయనే వెనుకబడ్డారో. ఆయన్ను ఎవరైనా వెనక్కు నెట్టారో తెలియదు కానీ ఎక్కడా కనిపించడం లేదు.

మొన్నటివరకూ విశాఖను తన కార్యక్షేత్రంగా చేసుకుని ధూమ్ ధామ్ చేసిన విజయసాయి రెడ్డి మళ్ళీ త్వరలో యాక్టివ్ అవుతారని అంటున్నారు. మళ్ళీ ఆయన్ను హుషారుగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనాల్సిందిగా జగన్ ఆదేశించారని అంటున్నారు.

వాస్తవానికి విజయసాయి రెడ్డి గతంలో పార్టీ అన్ని అనుబంధ సంఘాలకు అధ్యక్షుడిగా అందెవరు. అంటే సోషల్ మీడియా, మహిళా విభాగం, యువజన విభాగం,, బిసి, ఎస్సి, ఎస్టీ, ఎస్సి … ట్రేడ్ యూనియన్, టీచర్స్ విభాగం ఇలా అన్ని విభాగాలతోబాటు ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా ఉండేవారు. ఆంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 34 ఎమ్మెలే లకు ఈయనే అధికారిక, అనధికారిక బాస్ అన్నమాట.

దీంతో విశాఖ వేదికగా అయన అపరిమిత అధికారాలు చెలాయిస్తూ భారీ అక్రమాలకు తెరతీసారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రభుత్వ భూములతోబాటు డీ పట్టాలు, ప్రయివేట్ ల్యాండ్స్ కూడా భారీగా కొనుగోలు , కబ్జా..బెదిరింపు వంటి చర్యలతో చేజిక్కించుకున్నారని ఆరోపణలున్నాయి.

జనాల్లో గ్రూపులను ప్రోత్సహించడం, తనకు అర్థంకాని అంశాల్లోనూ దూరిపోయి పెద్దరికం చేసి మొత్తం వ్యవహారాన్ని, పొలిటికల్ వాతావరణాన్ని పాడుచేయడం వంటి వాటికి ఎక్కువ గా పాల్పడుతున్నారని జగన్ కు రిపోర్ట్ వెళ్లడంతో కొద్దిరోజులు ఆయన్ను అండర్ గ్రౌండ్ కు ఆంటే, సైలెంట్ మోడ్లోకి వెళ్ళమని జగన్ చెప్పారని అంటారు.

దీంతో గత ఆర్నెల్లుగా సాయి రెడ్డి ఎక్కడ కనబడలేదు. ట్విట్టర్, పేస్ బుక్ కూడా పెద్దగా యాక్టివ్ కాకుండా ఉండిపోయాయి. అప్పుడప్పుడు కేంద్రాన్ని కీర్తిస్తూ రెండు మూడు ట్వీట్స్ మినహా జగన్ ప్రభుత్వం మీద భజన కానీ టిడిపి మీద దాడులు కానీ లేకుండా ఆగిపోయాయి.

ఆ తరువాత అనుబంధ సంఘాలకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంచార్జ్ గా వేయగా ఉత్తరాంధ్రకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంచార్జ్ గా వచ్చారు. ఎవరొచ్చినా ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్దగా లాభం లేకపోయింది.

అంతేకాకుండా ఆమధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి చేతిలో వైసిపి అభ్యర్థి ఓడిపోవడంతో జగన్ కు షాక్ తగిలింది. అంతే కాకుండా పూర్తిగా సైలెంట్ లోకి వెళ్లిన విజయ్ సాయి రెడ్డిని మళ్ళీ యాక్టివ్ కావాలని జగన్ ఆదేశించారు అంటున్నారు.

మళ్ళీ అయన వస్తే కొంత వరకూ పార్టీ నెట్ వర్క్ యాక్టివ్ అవుతుందని అంటున్నారు. అయితే మళ్ళీ ఆయన ట్విట్టర్, పేస్ బుక్ పోటెత్తుతాయని అంటున్నారు. చూడాలి ఈసారి ఆయనకు జగన్ ఏ బాధ్యతలు ఇస్తారో… ఆయన ఏవిధంగా వాటిని నెరవేరుస్తారో చూడాలి..